పుట:కాశీమజిలీకథలు-06.pdf/185

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

నమస్కరించుచు జనకా ! మీరునాకుఁ బలుమారు బెండ్లి ప్రయత్నముఁ జేసితిరిగదా ? నే నుపేక్షించినందులకు ఫలమిప్పటికిఁ దొరికినది. నాకోరిక లక్షణంబు లన్నియుంగల చిన్నది నేటిఁకి గనఁబడినది. కాంతిసేన అను రాజపుత్రిక నాకుఁ దగియున్నది. మీ యొద్ద నున్న విద్దెలు రెండును నా కుపదేశింపుఁడు. తృటిలోఁ బెండ్లియాడి మీ యొద్దకు దీసికొని వచ్చెదనని దత్త్వృత్తాంత మంతయు నివేదించెను.

ఆ తపస్వి పక్కు ననవ్వుచు గామందకా! నీ బుద్ధికౌశల్యము, నేనెఱుఁగనిదిగాదు టక్కరి టమారీలనే మోసపుపుచ్చిన యారాజపుత్రికను నీ వెట్లు వంచింపఁ గలవు వలదు. వలదు. ఇంటికడ సుఖంబుండుమని యెంతయో బోధించెను గాని యాతండు సమ్మతింపక నావిద్య లుపదేశింపనిచో బలవంతముగా సమసెదనని పలుకుచుండెంర్.

ఒక్కడే కొడుకుగావున నేమనుటకు నోరు రాక జలంధరుఁడు పో పొమ్ము. నీకు గజకర్ణ విద్య మాత్రముపదేశించుచున్నాను. రెంటికిఁదగవు ప్రజ్ఞాగల వాడవైతే దానతోఁగార్యంబు సాధించు కొనవచ్చునని పలుకుచు నావిద్య నుపదేశించెను.

కామందకుఁ డాక్షణమే శంతనాదులకడ కఱిగి మిత్రులారా! నాతోరండు? ఆ రాజుపుత్రికను మీ యెదుటనే పెండ్లి యాడెదనని పలుకుటయు వారునలువురుఁ జుట్టుకొని వాని విద్యాలాభము విని పరమానంద భరితులై వానివెంట నరుగుచు నిట్లనిరి. కామందకా ! నిన్నుఁ బెండ్లి యాడెదనని చెప్పి నీవిద్య లాగికొనఁగలదు. దానిమెడలో మంగళ సూత్రముఁ గట్టువరకు దానిమాట లేమియు నమ్మవద్దు. పెక్కులు వలపులు జూపఁగలదు. దేనికిని వశము కాఁగూడదు. నీవు పెండ్లి యాడితివేని మాకిష్టమే. మావిద్యలు మాకిప్పింపవలయుంజుమీ ? అని పలుమారు వానికిఁ జెప్పవలసినమాట లన్నియుం జెప్పిరి. అతం డొహో ! నాకింతఁ జెప్పవలయునా? నే నెఱుఁగనివాడఁను కాను. కావలసిన వేన వేల మాయలు మీకుపదేశించెదనని సగర్వముగా నుడివెను. వాని మాటలు విని శంతనుఁడాక్షేపించుచు వీనిం దప్పక నప్పూబోణి విద్యలాగి బద్దుం జేయఁగలదని నుడివెను.

అట్లు కామందకునితో ముచ్చటించుచుఁ గొంతదూరము వచ్చి శంతనాదులు రాజపుత్రిక తమ్ముఁబట్టించునను వెరపునఁ బురిఁ జొరనొల్లక వేరొక గ్రామమునకుఁ బోయిరి. కామందకుడుమాత్ర మావీటికింజని తన విద్యాప్రభావంబు లూరంతయుఁ జాటం బంచి తనతోఁగలహమునకు రమ్మని రాజపుత్రికకుఁ బత్రిక నంపెను.

కాంతిసేన యయ్యుదంతము విని కేసరిణికిఁ గొన్ని మాటలుపదేశించి యాకామందకునొద్ద కనిపినది. కేసరిణి యల్లన నతనియొద్దకఱిగి నమస్కరించుచు ఆర్యా ! నేను రాజపు‌త్రిక దాదిని. ఆమె మీస్వాగత మశిగినది. మీ విద్యాపాటవమున కక్క జపడినది మీరు లోకపూజ్యమైన విప్రవంశమున జనించితిరి. త్రిలోక మోహజనకమైన విద్యల సంపాదించితిరి. మీకు మా రాజపుత్రిక --------------- దా? పూజించి