పుట:కాశీమజిలీకథలు-06.pdf/174

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరసేనుని కథ

179

ఆ మాటలువిని యతండు కానిమ్ము. చూతముగాఁ బోయి చెప్పుమని పలికి లోపలికిం బోయెను. అప్పు డాకేసరిణిపోయి రాజపుత్రితో నంతయుం జెప్పినది. కాంతిసేన మరునాడు సఖులతో నఱిగి యా రాజపుత్రుని మేడ కనతిదూరములో నొక యుపవనము గల్పించి యందుఁ బుష్పాపచయముఁ జేయుచుండెను.

ఆ వనముఁ జూచి రాజపుత్రుఁడు, యింద్రజాలకల్పితమని నిశ్చయించి మహేంద్రజాల విద్యాపాటవంబున జంఝామారుతంబు నుఱుములు మెఱుములు గలిపి పిడుగులు పడియెడు వర్షంబును గలుగజేసి ముహూర్తకాలములోఁ గాంతిసేన నిర్మించిన వనమును నాశనము నొందించెను. అప్పుడాచిన్నది మరల మాయఁబన్ని అనేకక్రూరసత్వములచే భయంకరమై యొప్పుకాంతారము సృష్టిఁజేసినది. అందలి మృగంబుల సూచి శంతనాదులు గంతులువైవఁ దొడంగిరి.

ఓహో ? వెరవకుఁడని పలుకుచు నా మృగములకుఁ బ్రతిమృగములఁ గల్పించుచు నల్పకాలములో వానినెల్ల నంతము నొందించెను. అప్పుడు రాజపుత్రిక తనమాయ నిలువకుండుటకు జిం‌తించుచు అన్నన్నా ఒకదివసమెల్ల లోకుల మోహింపఁజేయు నామాయ గడియయైన నిలువకున్నది. అతఁడు రచించిన వనము చెక్కుచెదరక ప్రకాశించుచున్నది. ఎప్పటికప్పుడే నేనొక్కరితను మిగులుచుంటిని. మహేంద్రజాలము నాచే భేదింప శక్యముగాకున్నది. వీని నెట్టు జయించుదాననని యాలోచించుచు మరియు ననేకమాయలు కల్పించి వారిని మోహపెట్టినది. కాని వాని నెల్లఁ బ్రతిమాయలచే నతఁడు రూపు మాపఁజేసెను.

రాహువిముక్తయగు చంద్రరేఖవోలె మాయావిముక్తయై ప్రకాశించుచున్న కాంతిసేనుఁడు మార వికార దూషిత స్వాంతుండై తదాకారచేష్టావిలాస విభ్రమంబుల సంభ్రమముతో నుపలక్షించుచు నొండెరుంగక తన్మయత్వము నొందెను స్త్రీమాయ యెల్ల మాయలకు మీరినదికదా ?

వీరసేనుఁడు మేడనుండి తన్న సాభిలాషగాఁ జూచుచున్నాడుగదా యని తెలిసికొని కాంతిసేన విలాసముల నభివ్యక్తము సేయుచు నందలమెక్కి సఖులతో నింటికిబోయినది. పిమ్మటఁగేసరిణి రాజపుత్రునొద్ద కరిగి నమస్కరించినది. అతండు దానింజూచి చిగరుబోణీ! మీ దేవి నాతో మాటాడక యింటికిఁ బోయినదేమి ? నిన్ననేమా చెప్పితివే ? నా సామర్ధ్యముఁజూచినదిగద ! మెచ్చి కొన్నదియా ? ఏమన్నదియో చెప్పుము. ఇందుగూర్చుండుము. నీ సఖురాలు మంచి చక్కనిదే ? యేమో యనుకొంటిని. అని అడిగినమాటయే‌ యడుగుచుఁ జెప్పినమాటయే చెప్పుచు నున్మత్తవికారము సూచించెను. అప్పుడు కేసరిణి‌ యతనిఁ తమవలలోఁ బడినవానిగాఁ దలంచుచు ముసిముసి నగవుతో‌ దేవా! మా రాజపుత్రిక మొదటనే యోడిపోయితినని చెప్పమన్నది. మీ సామర్థ్య -------------- ? మెచ్చుకొనుట మిమ్ము పెద్దగా స్తుతియించినది మిమ్ము భర్తగా వరించినది. ఇక మీ