పుట:కాశీమజిలీకథలు-06.pdf/165

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

ఆహా! నీ పౌరుషము ! నీ దేహంబిట్లు దాచికొని యెన్నినాళ్ళు బ్రతికెదవు ? నీ బలముఁ దలంచియు నా బుద్దిబలముఁ దలంచియు నీమాటలు విననొల్లక చింతిల్లు చున్నదాన. ఒరుల తెఱంగున మనల బెదరించిన యమ్మించుబోణి రక్త మాంసములు పీల్చకున్న వంచకుఁడననగు దాని టక్కరి జిత్తులు నక్క యొద్ద సాగునా? లెమ్ము. లెమ్ము. నా నా మాట నమ్మవేని యీ లతాపాశముల నాకును నీకును బంధింపుము. అని బోధించుచు దాని నొడంబడఁజేసి తీగెలచే నిరువురి యంగంబులకు లంకెలు వై చి బలవంతమున నా పులిని నా పడఁతియున్న పొదదాపునకు లాగికొని వచ్చినది. పులి వెనుకకు లాగుచుండ నక్క ముందరికి లాగుచున్నది.

బుద్ధిమతిక యా రాకఁజూచి యౌరా ! మొదటిగండము దాటినది. పులి నెట్లో బెదరించితిని. కాని యీ నక్క మరల లాగికొని వచ్చినది. ఈ మాటు దీని‌ నోటికిఁ గబళములగుదుము. నా జిత్తులు నక్కయొద్ద సాగవు. ఏమిచేయుదు దై వమా? యని యాలోచించుచు నొక యుపాయము తోచి‌ యహో! సృగాలమా! న‌న్నెంత మోసముఁ జేసితివి. నీ వంచకనామము సార్థకమైనది. ఇద్దర పిల్లలకు జెరి యొక పులినిదెచ్చి యిచ్చెదనని లంచముఁగొని యింతదనుక వచ్చితివికాదు. రెండవ పులి యేదీ ? ఒక్కదానినే తెచ్చితివేల? పిల్ల లాఁకట మలమల మాడుచున్నారు. వీరి కిది యేమూలకు వచ్చెడిది నీ పనిఁ బట్టక‌ విడువ. నిలునిలుమని యదలించినది

ఆ మాటలువిని యా బెబ్బులి గొబ్బున మరలి అన్నన్నా ! ఆప్తుండవని నమ్మినందులకు మంచి యుపకారముఁ జేయఁబూనితివి. ఇదియా నీ సంకల్పము ? తెలిసినది. అక్కటా ? ఎంత గండము గడిచినది. అని పలుకుచు నా నక్క మెడయందు గుదెకర్రవలె నేల వ్రేలాడుచుండ నిమ్మోన్నత విభాగముఁ దెలియక తరులతాగుల్మినీ ప్రభృతులఁ బడనేయుచు నతిరయంబున బరుగెత్తఁ దొడంగెను. అట్లు పెద్ద దూరము పఱచి ధా వనాయానమున నోరెండ నొక చెట్టునీడ నిలువంబడి గుండెలు తటతటఁ గొట్టుకొనఁ బెచ్చు పెరుగు కోపముతో జంబుకముం జూచి వంచకా! యిప్పుడు నీ యంత్రముల విదళించి రక్తముఁ ద్రావెదను. నీవు కావించిన మిత్ర ద్రోహమున కిది చాలునా ? అని యడిగిన నా నక్క వినయం నభినయించుచు స్వామీ ? నా నేరము సైరింపుఁడుఁ తప్పుచేసితి. అధి యట్లుండ మీ రిందు నిలిచితిరేని యా వ్యాఘ్రహంత్రి మదీయ చరమాంగరక్త ధార ననుసరించి రాగలదు. ఈసారి చూచిన పోనీయదు. అది రాకమున్న మీ దారి మీరు పొండు. నా తప్పు వేరొకప్పుడు విమర్శింతురు గాని యని పలికిన నదియు యుక్తి యని తలంచి యాచారముల మెకంబు వేరొక అడవికిఁ బారిపోయినది. క్రూరులకడ నిజముఁ జెప్పినను మోసమే చేయుదురు గదా.

తల్లీ! అ బుద్దిమతికయా గోమాయువును బెబ్బులిబాధ నెట్లుఁ దప్పించికొనిరో యుపాయంబున నేనును నీ బ్రాహ్మణ ప్రభువుల మాయలనట్లే తప్పించు