పుట:కాశీమజిలీకథలు-06.pdf/157

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

వ్రాయఁబడి యున్నది. ఆ విలాసముఁ జూచి కరభుఁడు సంతసించుచు లోనికిం బోయి తాను బరదేశుఁడననియు నా పూట భోజనము పెట్టుమనియు నడిగెను. పురోహితుం డప్పుడింట లేకపోవుటచే నతనితల్లి కడు నిల్లాలగుట నతిధిపూజ కంగీకరించినది. ఆమె కెనుబదియేండ్లున్నవి. కొడుకులును గోడండ్రును దేవతగానెంచి పూజించుచుందురు. కావున పనిపాటలులేక యొక తిన్నెమీద గూర్చుండి జపమాలను ద్రిప్పుచుఁ బంచాక్షరీ జపముఁ జేసికొనుచుండును.

ఆ యతిధి యామెయొద్దఁ గూర్చుండి అమ్మా ! నీవు కడు యోగ్యురాలవు. అదృష్టవంతురాలవు. అడిగినంతనే భోజనమునకు రమ్మంటివి. ఇప్పటి కాలములో నీపాటి‌ ధర్మపరిపాటిగలవా రుండిరా ? అని పొగడుచుఁ గొ‌డుకు లెందరు ? కోడండ్రు చెప్పినట్లు విందురా ? కూతుండ్రు గలరా ? పుత్రుల కేమిపని అని యడిగిన నామె యిట్లనియె. అయ్యా! నాకు మువ్వురు కొడుకులు. కూత్రుండ్రు లేరు మాకు రాజపౌరోహిత్యము కలిగియున్నది. దానంజేసి జీవికకు నేమియుఁ గొఱఁతలేదు. పెద్దవాఁడు సంతతము రాజసమక్షమున నిలిచి తిధి వార నక్షత్ర గ్రహచార విశేషంబులం దెలుపుచుండును. రెండవవాఁడు తన్మంత్రుల నాశ్రయించును. మూడవవాఁడు రాజపత్నియొద్ద బంచాంగముఁ జెప్పుచుండును. మువ్వురు రెండుపూటలయందును నగరున కరుగుచుందురు. వచ్చువేళయైనది. నా కే కొరంతయు లేదు అని తన వృత్తాంత మంతయుం జెప్పినది. అంతలోఁ గొడుకులు మువ్వురు కోటలోనుండి వచ్చి తల్లి కి నమస్కరించిరి. తల్లి దీవించుచు వత్సలారా! నగరు విశేషము లేమి? రాజు కుశలియై యున్నవాఁడా ? రాజపత్నికి భద్రమా అని యడిగిన పెద్దవాఁ డిట్ల నియె.

అమ్మా! మనరాజు నాటినుండియు విపరీత బుద్దియై యుండెను. మునుపటి ధర్మగుణ మొక్కటియును లేదు. పంచాంగము చెప్పనక్కరలేదఁట. తానే చూచుకొనునఁట. అరువదియేండ్లు దాటినవి. భార్య తనయొద్దకు వచ్చినది కాదని మిగులఁ గోపించుచు నిప్పు డొక పెండ్లి కూతుం జూడుమని నాకు నియమించెను. మాట కడ్డుఁ జెప్పినవారి శిక్షింపు చున్నాడు‌. ఈ రాజునొద్దఁ గొల్వుఁ‌జేయుట కష్టముగా నున్నదని పెద్దవాఁడు చెప్పెను.

అప్పుడు రెండవవాఁడు తల్లీ! మంత్రులు రాత్రింబవళ్ళు రాజు దుశ్చేష్టితముల గురించి విచారించుచున్నవారు. నాఁడు రాజు సమసినంత నతని దేహములోఁ బరకాయ ప్రవేశ విద్యానిపుణుఁ డగు నీచుఁ డెవ్వఁడో ప్రవేశించెనని యొకమంత్రి వాదించుచున్నవాఁడు. అని రెండవ కుమారుఁడు చెప్పుటయు విని తల్లి మూడవ కొడుకువంకఁ జూచి నాయనా! రాజపత్ని కడు ధర్మాత్మురాలు. పతి దుశ్చేష్టితముల గురించి యేమను చున్నదని యడిగిన నతం డిట్లనియె.

అంబా ! ఆమెకుఁ బతియొద్ద కరుగవలయునని లేదట. ఎన్నిసార్లు