పుట:కాశీమజిలీకథలు-06.pdf/148

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

(20)

కౌశికుని కథ

153

జామున లేచి స్నానముఁజేసి యొడలెల్ల విభూతిరేఖలు మెరయఁ బరమ శ్రోత్రియుండువోలె నొప్పుచు గర్దముని యిల్లెక్కడనిన యక్కడ నక్కడ నడుగుచు వచ్చి వచ్చి తుదకుఁ గర్దనుం గాంచి సాదరముగాఁ జూచుచు అయ్యా! గర్దముఁడవు నీవేనా? పెద్దదూరమునుండి మీ యగ్రహారమును నిన్నును నడిగికొనుచు వచ్చితిని. నిన్నుఁ గాంచితిని. కృతకృత్యుండ నై తినని పలికిన విని యాకర్దముఁడు విస్మయఁ పడుచు నతని కతిధిసత్కారములు దీర్చి సుఖోపవిష్టుండైయున్న యా పూజ్యునకు నమస్కరింపుచు నిట్లనియె. అయ్యా! నేను కర్దముఁడనే ! నా పేరు మా గ్రామము పేరును స్మరించుచు వెదకి యింతదూరము రానేల ? మీ రూపము కడు తేజోవంతముగాఁ గనంబడుచున్నది. ఈ యల్పునిపై మీ యట్టివారి కంత యనుగ్రహము కలుగుటకుఁ గారణము వినఁగోరుచున్నాను. అని యెంతయో వినయముతో నడిగిన నా కౌళికుం డిట్ల నియె.

పెండ్లి చేయవలసిన పుత్రిక నీకుఁ గలదా ? లేదా? నా మాటఁ జెప్పుము. పి‌మ్మట నీ కుత్తరముఁ జెప్పుదు ననుటయు ఆ ! యున్నదని పలికెను. అట్ట యిన నీవే ? సందియములేదు. వినుము నేను పశ్చిమదేశ వాసుఁడను. నా పేరు కౌశికుఁ డందురు నేనుఁ జిన్నతనములో వేదశాస్త్రములఁ జదివితిని. రామాయణములోఁ గౌశికునిచరిత్రము జదివి తపంబున నెట్టికార్యము సఫలమగుననినిశ్చయించి యుత్తరకురు దేశమున కరిగి యిరువదియేండ్లు మహారణ్యములో నివసించి కందమూలం౦బులం దినుచు నిరువదియేండ్లు ఘోరతపముఁ గావించితిని. నా దపమునకు మెచ్చికొనుచు శంకరుఁడు ప్రత్యక్షమై నీకేమి కావలయునని యడిగిన నప్రయత్నముగా నా నోటినుండి చక్రవర్తి యగు కొడుకు కలుగవలయునని వాక్కు వెడలినది.‌.

నా మాటవిని చంద్రచూఁడుడు మందహాసము గావింపుచు వత్సా! ద్రవిడ దేశములోఁ దామ్రచూడమను నగ్రహారము గలదు. అందు ----- యను శ్రోత్రియుఁడు కాపురము చేయుచున్నాఁడు. వాని పుత్రిక వివాహయోగములో నున్నది. నా మాటగాఁజెప్పి యా కన్నియ నడుగుము. వారు నీకిచ్చి వివాహము సేయుదురు. ఆ బాలికకు సార్వభౌముం డుదయింపఁ గలడు. అంతకమున్న యా పట్టి కట్టి వరమున్నది. దానంబట్టి నీ కోరిక సిద్దింపఁ గలదు. వేగఁబొమ్ము. పెండ్లియైన వత్సరములోనే నీకుఁ గొమరుఁ డుదయించునని తానతిచ్చిన విని నేను గోరిన కోరికఁ దలంచుకొని నాకు నేను నిందించుకొనుచు నిట్లంటిని.

దేవా! సకల బ్రహ్మాండములకు హేతుభూతుండవగు నీవు ప్రత్యక్షమై గామన్తేనువను వదెళు భఖ ఎప్పు. లోదులు యం. తు నాము ఏ ళు తున్భవాం ౧తవంల సుతః డక్కర

ఫ్‌! ప్ర లన లను. గోరిరినం యంఠి స్టైంచిని ననుమతింపక గంగొంముంటు పుం