పుట:కాశీమజిలీకథలు-06.pdf/141

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

146

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

అంతలో భట్టపాదుండు విద్యార్థులతో స్నానముఁ జేసివచ్చి యతిధింగాంచి స్వాగత మడిగి లోనికింబోయి భార్యతో నభ్యాగతుండు వాకిట నున్నవాఁడు చూచితివా? అని యడిగిన నామె అమ్మాయిచూచి తీసికొని వచ్చినదట. సపర్యలన్నియు నదియే కావించినది‌. విసరుచుఁ బెండ్లి మాట యడగినంత సిగ్గుపడి యిప్పుడే లోపలికి వచ్చినది. మంచిసంబంధ మెచ్చటనో యున్నదని చెప్పిరఁట. ఏదియో యడిగి తెలుసుకొనుఁడని మగనికి బోధించినది.

అతండు సరియే చూతమని పలుకుచు శిష్యముఖముగాఁ గామగ్రీవుని స్నానముఁ జేసి రమ్మని నియమించి తాను దేవతార్చనఁజేయుచుఁ గూతుంజీరి అమ్మా! అతిధిని స్వయముగాఁ దీసికొనివచ్చి పూజించితివట. మంచిపని జేసితివి అట్లే చేయుచుండుము. అని యభినందించిన నవ్వుచు నబ్బాలిక తండ్రీ! ఆయనకుఁ తాత యనఁ‌ గోపము వచ్చినది. తాను జిన్నవాఁడట. వింటివా యని యా సంవాదప్రకార మంతయుం జెప్పినది. అంతలోఁ గామగ్రీవుండు స్నానముఁ జేసి వచ్చుటయు నా విప్రపత్ని వారినెల్ల మృష్టాన్న సంతృప్తులం జేసినది.

భోజనానంతరము భట్టపాదుండు చావడిలో గూర్చుండి యిష్టాలాపము లాడుచుఁ గామగ్రీవునితో మీ దేగ్రామము? ఎందుఁబోవుచున్నారు? మా పిల్లకు మంచి సంబంధమెందో యున్నదని చెప్పి‌రట. ఎందున్నది? తద్వృత్తాంత మెఱింగింపుఁడని వినయముగా నడిగిన నతం డిట్లనియె.

అయ్యా! మనము వివక్తమునఁ గూర్చుండి మాట్టాడుకొనవలయును. మీతో నొకరహస్యోదంతము నెరింగింపఁ దలచికొంటి లెండు లోని‌కింబోవుద మనుచు నతండందున్న శిష్యులనెల్ల దూరముగాఁ బొమ్మని యందే యక్కథం జెప్పుమనుటయు నతం డిట్లని చెప్పందొడంగెను.

అయ్యా!వినుండు. నా కాపురము కాంచీపురము. నా పేరు కామగ్రీవుండు. నేను జనించిన కొంచెము కాలములో నా తలిదండ్రులు దివి కఱిగిరి. దిక్కులేనివాడనై బంధువులచేఁ బోషింపఁబడితిని. చదువేమియు వచ్చినదికాదు. తిరిప మెత్తికొనుచు గొన్ని దినములు గడపితిని. నాతోడివారెల్ల భాగ్యవంతులై గజాశ్వాంబోరాదులెక్కి తిఱుగు చుండుటయు నాకుఁ దినుట కన్నమైన లేకపోవుటయుం దలంచి మిక్కిలి దుఃఖించుచు నొకనాఁడు మా గ్రామములో నొకపండితునాశ్రయించి ధన మెట్లు లభించునని యడిగితిని. పండితుండు నా కోరిక విని నవ్వుచు నీక్రింది శ్లోకముఁ జదివెను.

శ్లో. ధనినం చాప్రదాతారం దరిద్రం చా తపస్వినం
    ద్వావభసి వినిక్షి ప్యౌగళే బధ్వా బృహచ్చిలాః

దానముఁ జేయని భాగ్యవంతుని

రాయిగట్టి నీటిలో ముంచంద! గొంత య్దేన్నవగానే తసంబిన

కేమికావలయును. తపంబున నన్నికార్యములు సిద్ధించును. తపంబునఁ బావములు