పుట:కాశీమజిలీకథలు-06.pdf/139

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

144

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము


కామగ్రీవుని కథ

అరువదియేండ్ల ప్రాయముఁ గలిగి తపస్సముపార్జితంబగు యశోవిసరము తలయెక్కి మెఱచుచున్నదో యన పండిన వెండ్రుకలతో నొప్పుచు నంగకమ్ములన్నియు నించించుక మడతలు వారినను దేజోవంతమైనకాంతిఁగలిగి నిలువ నూతగాఁ బూనిన దండంబును వార్దక్యదోషంబు మాటుపడ విలాసముగాఁ ద్రిప్పుచుఁ గామగ్రీవుఁడను బాహ్మణుఁడొకనాఁడు అల్లంతఁ బ్రొద్దెక్కినంత విప్రగూటమను నగ్రహారపు నడి వీధి నరుగుచుండెను

అట్టితరి నా యూరిపారుతలు పుట్టములు దట్టముగాఁ గ్రుక్కిన కలశముల నంసమున నిడికొని తటాకమున కరుగువారును, తటాకమును౦డి జలపూర్ణ కుంభంబుల భుజ౦బుపై నిడికొని యిళ్ళకు వచ్చువారును బెక్కం డ్రాపారునకు నేత్రపర్వముఁ గావించిరి. అప్పుడా బ్రాహ్మణుఁడు ఆహా! నాకు రాత్రి భోజనములేదు. ఆకలి బాధించుచున్నది. ఈ యిల్లాండ్రందరు నన్నుఁజూచి యోసరించి పోవుచున్నారు. కాని యింటికిఁ గుడువరమ్మన్న గేస్తురా నొక్కెతెయులేదు. ఇరుదెసల వేదికలపై గూర్చుండి యేగ్రామము? ఎందుఁ బోవుచున్నారు? పేరేమియని యడుగుదురే కాని యీ బ్రాహ్మణులలో నొక్కరుఁడు నింటికి రమ్మని చీరినవాఁడు లేడు. స్వాద్యాయ ఘోషము‌ శాస్త్రవాదములు మాత్రమూరక వినంబడుచున్నవి. భూతదయలేని వీరి చదువేమిటికో తెలియదు. అని నిందించుచు మరికొంతదూరము నడిచెను.

అప్పుడా ప్రాంతమందలి యొకయింటిలోనుండి చక్కని బాలిక యొకతె యీవలకు వచ్చినది. ఆ కన్నెమిన్నంజూచి యాజన్నిగట్టు తలయూచుచు నందు నిలువంబడి యోహో! ఈ బాలికకు బండ్రెండేండ్లు దాటిన ప్రాయము గలిగియున్నది దీనిం బెండ్లి యాడిన నాఱుమాసములకే కాపురమునకు వచ్చును. వత్సరములోపుననే సంతతిఁ బడయవచ్చును. దీని నాకిత్తురేమో యడుగుదునా?! అక్కటా! తల నరసిదోష మొక్కటియే నన్ను ముసిలివాఁడని సూచించుచున్నది. అయినను నాకు నేను జూచికొనినంత పెద్దవాఁడువలెఁ కనంబడను. నావిద్యాసంపదల తెరవెరింగిన దీనితండ్రి నాకీయక మానఁడు ఈ పూట వీరింటఁగుడిచి స్నేహముగలిపి పిల్లనిమ్మని యడిగెదనని నిశ్చయించి యబ్బాలికంజూచి బాలామణీ! నీ పేరేమి? ఈ యిల్లు మీదేనా! నాకీ పూటభోజన సదుపాయము చేయింతువా? అని యడిగిన నాకన్నియ యిట్లనియె.

తాతగారూ ఈ గృహము మాదే రండు రండు. ఈ వేదికపై విశ్రమింపుఁడు. ఈ పూట కాదు. పది దినము లిందుండవచ్చును. భోజనమున కేమియు నభ్యంతరములేదు. మా తండ్రిగా రింతకుముందె శిష్యులతోఁ డే రంగలచు. అ... పలుకుచు లోపలికిటేయి శ లమ). ో