పుట:కాశీమజిలీకథలు-06.pdf/132

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

(18)

విచిత్రనాటకము కథ

137

అప్పుడు రూపవతి అన్నా! నీవు రాజువు కావున మరచిన మరతువు. నాకేల తెలియకండెడిని. ఈతం డెవ్వడో యెరుఁగుదువా? నీప్రజ్ఞ చూతము చెప్పుము. అని శీలవతింజూపుటయు నతండు మాటాడినంగాని చెప్పఁజాలనని ప్రత్యుత్తరమిచ్భెను.

బాల్య యౌవనాంతరదశల యందును యౌవనవార్దక్యాంతర దశలయందును జూచుట యించుక యెడమయ్యెనేని నెట్టివారికి గురుతుపట్టుట కష్టము. రూపవతి శీలవతిని మాటాడవద్దని సంజ్ఞఁ జేసినది శశాంకుఁ డించుక‌ మొగము పరిశీలించి చూచి ఆ! తెలిసికొంటిఁ దెలిసికొంటి మన మొదటిమిత్రుఁ డితఁడే. అన్నన్నా! నన్నింత మోసముఁ జేసితిరి. అని పలుకుచు నతని నాలింగనముఁ జేసికొనియెను.

శీలవతి నవ్వుచు నిప్పటికిఁ దెలిసికొంటివిగదా! యని యభినందించుచు నప్పటికిఁ దగినరీతి సంభాషించినది. సత్వవంతుం డది యంతయుఁ జూచి నవ్వుచు నిమ్మహారాజు మీనలువురలో నొకఁడాయేమి? పోలికఁ జూడ నట్లే కనిపించుచున్నది. బళిరా! మీరెంత చేయఁగలవారు? మీకు మీర సాటియని యతం డాశ్చర్యము జెందుచుండ శశాంకుఁడు రూపవతివంకఁ జూచి యీతని నెరింగించితిరా? యని సంజ్ఞఁ జేయుటయు నెరింగించితిమని సూచించినది.

అప్పుడా మువ్వురు పువ్వుబోణులు రహస్యముగాఁ గూర్చుండి యొండొరులు పడిన కష్టసుఖంబుల నొండొరు లెరింగించు కొనిరి. విద్యావతి జాడయే తెలియవలసియున్నదని తలంచుచు నాఁడు సుఖముగా వెళ్ళించిరి.

విచిత్రనాటకము కథ

మరునాఁడు వారు వాకిటఁ గూర్చుండి‌ ముచ్చటించుకొను చుండఁగా వీధిలోఁ జాటింపు వినంబడినది. అది యేదియో తెలిసికొని రమ్మని పరిచారకు నొకని బంపుటయు వాఁడు వోయి యొక నాటక వ్రకటనపత్రికం దెచ్చి వారికిచ్చెను. అందిట్లు వ్రాయఁబడియున్నది.

“కృతవర్మయను కవిచే రచింపబడినది శీలకళావిద్యారూపవతుల చరిత్రము. కరుణరసప్రధానము. ఈ కన్నెలు నలువురు మిక్కి.లి చక్కనివారలు. పెద్దగాఁ జదివిరి. వీరిలో శీలవతికిని విద్యావతికిని దండ్రులు పెండ్లి చేయవలయునని ప్రయత్నముఁ జేయ నిష్టములేమింజేసి పెండ్లికూఁతుండ్రు నదిలో మునిగిరని ప్రధఁ గల్పించి కళావతీ రూపవతులు వారి నూరు దాటించుట (కడునాశ్చర్యము) వారు సఖుల జాశ వేచి యొక యగ్రహారములో విద్యాభ్యాసము సేయుట శీలవతి పెండ్లికూతురు వేషము వైచుకొని గురువుపుత్రికకుఁ బెండిఁ జేయఁబూనుట. (హాస్యారసము) అని యీ ను ప్రచుకొని గుకుపు తికకు( బెండ్లి ( నేయగలూనుర. (నోస ఎవి తెంఆల్య గబా మంఠయునుపేన య్‌ ఇ గాచు వినాచు * సాలతచును రచంగనవత సెం వ్యతపత్మయే ఎ నిందఎములేదు... మనలం బలినకోను తలంపుత' ౧.౪ వర్మింప(