పుట:కాశీమజిలీకథలు-06.pdf/131

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

136

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

నాఁడట్లుంటి నిప్పుడీ క్షేత్రంబునకు వచ్చి తొంటిరూపుఁ గైకొంటినని తన యుదంతమంతయు నెరింగించెను. ఆకథవిని తన మనోరథ మీడేరునని యుబ్బుచు నబ్బురపాటుతో నాపాటలగంధి ఆర్యా! నీకొమరుండడుగో! ఆమూల స్నానముఁ జేయువాఁడే. నీ వాతనిం గురుతు పట్టలేకపోయితివి. అని యెఱింగించిన నందు నిలువక యతండు సంభ్రమముతో నరిగి నాయనా! మమ్ముమరచి దేశములు తిరుగుచుంటివా అని పలుకుచు వానిం బిగ్గరఁ గౌఁగలించుకొనియెను.

సత్వవంతుండు నివ్వెరపాటుతోఁ జూచుచు నయ్యా! తమరెవ్వరో నాకుఁ దెలియకున్నది. నన్నెవ్వరనుకొనుచున్నారు! మీ పేరు వినుదనుక మీకుఁ ప్రత్యుత్తర మిచ్చుట కవకాశము లేకున్నదని పలుకుటయు రూపవతి దాపునకువచ్చి పకపకనవ్వుచు సత్వవవంతా! నీ వీయనను చెప్పికొంటివేని నీకు నూరుదీనారములు కానుకగా నిప్పింతు ఈయన కడుదవ్వువాఁడు. నిదానించి వాక్రువ్వమని నవ్వుమాట నాడినది.

అప్పుడా బ్రాహ్మణుఁడు తండ్రీ! నేను నీతండ్రినే. శశాంక మహారాజు ధర్మమున నిప్పురి కరుదెంచి విగతశాపుండ నైతినని మరలఁ దనకథ యంతయు నతని కెఱింగించెను. సత్వవంతుఁడు తాను బ్రాహ్మణ కులుండనని యెఱింగినపిమ్మట బొందిన యానంద మిట్టిదని నుడువుటకు నా తరముగాదు. శీలవతియు దానికిబ్బడి మురిపెముఁ జెందినది.

రూపవతి శశాంకుని పేరువిని యతండు కళావతియైనచో మనము మిగుల ధన్యులముగదా? కళావతికి రాజ్యమెక్కడిది? అయినను జూచివచ్చుట లెస్సయని శీలవతితో నాలోచించినది. విద్వత్కేసరియు వారినందర వెంటఁబెట్టుకొని శశాంకుని సౌథంబునకుఁ బోయెను.

రూపవతి దూరంబుననే శశాంకుని జూచి గురుతుపట్టి శీలవతితో అక్కా! మన మిప్పటికిఁ గృతకృత్యుల మైతిమి. విద్యావతియు నీయూరనే యుండును. దైవ మిప్పటికి మరలఁ మనలఁ గూర్చెగదా? నన్ను గురుతుపట్టునో లేదో జూతముగాక అని మాట్లాడుకొనుచు వారు దాపునకుఁ బోయిరి.

అప్పుడు విద్వత్కేసరి మహారాజా! ఇదిగో మా సత్వవంతుఁడు గంగానదిలో స్నానముఁ జేయుచుండఁ గనంబడియెను. వీరు వీనిస్నేహితులు. పొతునల 2 సప్పిన మకరాలకుం గేశండే. వైవికముగా సితండును పనిం గలిసికొన ఎను. పరం పండగనే యంకడుమున్ను సత్వవంతు9 పె, బసరింప(జీసిన తశ్క.చుపుటబుపరలించి నుం ంకుం ఖూచుచు దూటున లేచి యోహోః యీమి ౮ మ గా అపసిం ,తగలించకాసుచు వయనాఖి ౫ న్నేన్వరనుకాంచఏ? గురుతు స స? బములో వెడిచి వచ్చిదనం కోపించితి? నాతప్ప్ర మ, ్నఆపునం అదియంను ప్‌యం యేమమా ముచ్చటిెంచెను.