పుట:కాశీమజిలీకథలు-06.pdf/112

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థూలజంఘ తామ్రకేశుల కథ

117

దెలియనేరదు. రాజపుత్రికయు రూపవతియు మా యిరువుర నూరు వెడలించి నిరూపించుకొనిన సమయమునకు మమ్ముఁగలిసి కొనిరి కారు. వారు బయలుదేరి వెడలుటకు నవసరము దొరికినదియో లేదో తెలియదు. సోమభట్టారకుని యింటికి యజ్ఞదత్తుఁ డతిధియై వచ్చినంతఁ దెలిసి మేమిరువురము పారివచ్చితిమగదా ? ఇంటికి బోవు‌దమని నేనెంతఁ చెప్పినను వినక శీలవతి యిటు లాగుకొని వచ్చినది. రాత్రి యిద్దర మీ వేదికమీదనే పండుకొంటిమి. శీలవతి యేమయ్యెనో తెలియదు. నిత్య కృత్యములు తీర్చుకొ‌నుటకై యరిగినదియా ? నన్నుఁ జేరకఁ యేలఁ బోయెడిని. ఇది కడు విపరీతము. రాత్రి నాకెంత నిద్రపట్టినది. అని యొకనాడు ప్రాతఃకాలమున ఘటికాచలమను నగరంబునఁ గృతవర్మ యొక గృహస్థునివీథి యరుగుపైఁ గూర్చుండి ధ్యానించుచుండెను.

అంతలో మేఘనాధుఁడను పేరుగల యా యింటియజమానుఁడు దంతధావనము నిమిత్తము వాకిటకువచ్చి తిన్నె పైఁ గూర్చున్న కృతవర్మం జూచి తద్రూపాతిశయమునకు నక్కజమందుచు, కుమారా! నీ దేయారు? నీపేరేమి। నీ కులశీల నామంబు లెట్టివని యడిగిన నతం డిట్లనియె.

అయ్యా ! నేను ద్విజకుమారుండ. నాపేరు కృతవర్మయండ్రు నా మిత్రుండు నేనును గాశికిఁ బోవుచు రాత్రి వచ్చి యీ వాకిలిపైఁ బండుకొంటిమి. అతండేమయ్యెనో తెలియదు. ఈ గ్రామంబున మృగబాధలు లేవుగదా యని యడిగిన మేఘనాధుం డిట్లనియె ?

ఈ యూర నట్టిబాధ లేమియునులేవు. మీ రిదివర కేమి చదివిరి? ఏమి చదువుటకైఁ గాశికరుగుచున్నారు. అని యడిగిన నతఁడు తాను జదివిన గ్రంథము చదువఁబోవు గ్రంథములు నిరూపించి చెప్పెను. వాని విద్యాసంపదకు మిక్కిలి విస్మయపడి మేఘనాధుఁడు దంతధావనముఁ జేసికొనుచు నతనితో నప్పటికిం దగిన మాటల ముచ్చటింపుచుండఁ గృతవర్మ అయ్యా ! తమ రేకులమువారు? ఏమి వ్యాపారముఁ జేయుదురు ? మీరేమి చదివితిరని యడిగిన మేఘనాధుం డిట్లనియె.

సఖుఁడా ! మేమును ద్విజులబో ? మాతండ్రి చాల ధనము సంపాదించి స్వర్గస్థుండైన నే ననేక వ్యాపారములు సేసి యాసొమ్ము కొల్లబుచ్చితిని. నాకు నాటకాలంకార సాహిత్యము గలదు. కొన్ని నాటకములు రచించి‌తిని. అంతటితోఁ దృప్తిఁబొందక నా నాటకములు ప్రదర్శించు నిమిత్తము నాటకోపకరణము లన్నియు సంపాదించి పాత్రములకు వేతనములిచ్చి నాటకము లాడించుచుంటి. మా నాటకములో నున్న భూమికాధారులందరు సంగీత సాహిత్య విద్యానైపుణ్యులుగా నున్నారు. మీ రడిగితిరి కావునఁ జెప్పుచుంటిని. ఈ కాలములో మా నాటక సమాజమునకుఁ గల ----------- మరియొకదానికిలేదు. ఇప్పుడు దేశాటనముఁ చేయఁ బ్రయత్నించు చున్నారము. మాకు స్త్రీ వేషధారులు కొందరు కావలసియున్నారు. నామాటకు మీకు