పుట:కాశీఖండము.pdf/6

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

viii

సంస్కృతీకరించెను. సంస్కృతభీమఖండము శ్రీనాథోపజ్ఞమే యనుటకు నీవ్యాసఘట్టమే ప్రమాణము. కాశిని వ్యాసుఁడు బాసినవృత్తాంతము రెండుగ్రంథములయందును, భిన్నభిన్నరీతులుగ నుండుట కిదియే కారణము. ఈ గ్రంథములను రెంటిని మూలగ్రంథములతో పరిశీలించి చూచిన నీవిషయము తేటతెల్లము కాఁగలదు.

క్షేత్రమహిమలు వెలయించుటయందు శ్రీనాథునికిఁగల ప్రత్యేకతను శ్రీయుత మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకటరత్నముపంతులవారు తమ బిల్వేశ్వరీయమున నవతారికలో నిట్లు ప్రశంసించియున్నారు -

శా. స్కాందం బందనువందివందితమునౌ ఖండద్వయం బాంధ్రభా
షం దివ్యంబుగఁ జేసి క్షేత్రమహిమాచార్యుం డనన్ గౌరవం
బందె న్మున్నుగ బిల్వనాథసమనామాఢ్యుం డెవండెంతు
సత్సందోహస్తుతు నమ్మహాకవిని విద్వన్నాథు శ్రీనాథునిన్.

శ్రీనాథుని రచనము లనఁగా, పదునాల్గు పదునైదవశతాబ్దిలోని యాంధ్రదేశరాజకీయ, సాంఘిక, సారస్వత చరిత్రపతిబింబములు. ఆంధ్రమహాజనుల సాహితీమయ జీవితమున సరసత్వమును, జాతీయతను, సభ్యతను ముద్రించి యజరామరకీర్తి గడించిన శ్రీనాథమహాకవిగ్రంథములుస ప్రమాణికపాఠములతో సంస్కృతమూలములతో, సవ్యాఖ్యానములతో సమగ్రముగ