270
శ్రీకాశీఖండము
| గగనగంగాతరంగిణీకనకకమల | 121 |
వ. | ఇ ట్లద్దేవుండు విశ్వేశ్వరనివాసంబు సొచ్చినంతన బహిర్భాగంబుననుండి హాహాకారంబున మొఱవెట్టుచు నా బ్రహ్మహత్య పాతాళంబునఁ బడియె. అతనిహస్తంబున నున్న ధాతృకపాలంబును నూడి ధాత్రీతలంబునం బడియె. అది మొదలుగా నవ్వటుకనాథుం డానందంబున నయ్యానందవనంబునం దధివసియించె. కపాలమోచనతీర్థంబు తన్ను భజియించువారికిఁ బాపభంజనంబు సేయుచుఁ బుణ్యప్రదాయకం బయ్యె. ఇయ్యాఖ్యానంబుఁ బఠించినను విన్నను వారలకు మహాపాతకంబు దొలంగు నని చెప్పి కుమారస్వామి వెండియు నగస్త్యున కి ట్లనియె. | 122 |
సీ. | అజుఁడు దా నధికుండ ననుచు గర్వించిన | |
తే. | యాధిపత్యంబు వడసెఁ గామారిచేతఁ | 123 |