తృతీయాశ్వాసము
101
| యభివ్యక్తంబై పరావా క్కనంబడు.ఆబ్రహ్మం బీనాభిపర్యంతం బావాయువుచేత నభివ్యజ్యమాసంబై విమర్శరూపంబైన మనంబుతోడంగూడి సామాన్యస్యందప్రకాశరూపిణియుఁ గార్యబిందుతత్త్వాత్మికయు నీశ్వరాధిదేవతయు నై పశ్యంతీవా క్కనంబడు. ఆ బ్రహ్మం బావాయువు చేతన హృదయపర్యంతం బభివ్యజ్యమానంబై నిశ్చయాత్మకబుద్ధియుక్తంబై | 49 |
తే. | అని నుతించినఁ బ్రియ మంది యబ్ధికన్య | 50 |
వ. | ఇంకఁ రాఁగలయిరువైతొమ్మిదవద్వాపరంబున నీవు వ్యాసుండవై వారణాశీపురంబున వేదపురాణసంహితాధర్మశాస్త్రంబులు వక్కాణింపంగలవాఁడవు. ఇప్పు డొక్కహితంబు సెప్పెదఁ. దుంగభద్రాతీరంబునం గిష్కింధాచలోపాంతంబున స్వామిమల యనుకాననంబునం గుమారస్వామి యధివసించియున్నవాఁడు. నీ వాచక్కటి కరిగి యతనివలన వారణాశీస్థానమాహాత్మ్యంబు వినుమని పలికి లోపాముద్రం గనుం | |