పుట:కామకళానిధి.pdf/95

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

అయిదువ్రేళ్ళగోరు లగ్రముల్ మోపగా
గబ్బిగుబ్బజనుల గదియజేయ
నది శశప్లుతాఖ్య మగు నఖక్షతమని
పేరు నిడిరి శాస్త్రసారఫణితి.


క.

మరునింట వీపునం గుచ
భరమున రేఖాత్రయంబు భాసిల గోరుల్
సరిగల్వరీతి నిలిపిన
ధర నుత్పలచిత్ర మనఁగఁ దనరున్ గృతులన్.


గీ.

అలుక వొడమినప్పు డతిమోహభరమున
నొడలు గరగునప్పు డెడయునపుడు
మదము గల్గునపుడు మఱి నిద్రవేళల
నొగి నఖక్షతంబు లుంచవలయు.


వ.

ఇంక రదక్షతంబులు గూఢకంబులును నుచ్ఛున్న
కంబును బ్రవాళమణియు బంధకంబును ఖండాభ్రకంబును గోళ
చర్చకంబును అను షడ్విధంబులు, ఈ దంతక్షత నఖక్షతంబుల ను
చితస్థలంబులందు నుంచదగు. నయనంబులు దక్కఁ దక్కిన
యెడల సీత్కార హీంకారపూర్వకంబుగ నుంచిన చంచలాక్షు
లు ప్రియంబు నొందుదురు. నాయికానాయకులు సుస్నిగ్ధమ్ము
లును సమానంబులును కుంద ముకుళాకారంబులును శిఖరా
రోపితంబులు నగు ప్రశస్తదంతంబుల మృదుప్రయోగంబు సేయ