పుట:కామకళానిధి.pdf/109

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రెండుచేతుల భువి నాని యుండ గూడ
నిది త్రివిక్రమకరణమై యింపుజెందు.


గీ.

కాంత తనరెండుపాదము ల్కాంతుశిరము
నందు నిల్పి పవళింపగా నతఁడు ప్రేమ
గుచయుగము రెండుచేతుల గూర్చి వెట్టి
కలియ నిది వ్యోమపదనామకలిత మయ్యె.


గీ.

నలినముఖి రెండుయూరులనడుమ నిల్చి
విభుఁడు చేతులు రెండు పృథ్వీతలంబు
నానుకొని క్రీడ నొనరించెనేని యిదియు
దనరు స్మరచక్రనామబంధంబు జాతి.


గీ.

తామరసనేత్ర తనదు పాదముల రెండు
నధిపు నుదరమ్ముపై చేర్చి నతనియూరు
వులను వంచి భుజద్వయి నొకటి గౌఁగ
లింపగ విదారితాఖ్యయై పెంపుజెందు.


గీ.

కాంత యనయూరువులు రెండు గగనమందు
నిల్పి పవళించిన విభుండు చెలువ రెండు
కురువులకు మధ్యమున నుండి కూడెనేని
సామ్యకరణంబుగా నిది సంజ్ఞ చెందు.