పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/92

ఈ పుట ఆమోదించబడ్డది

73

ద్వితీయాశ్వాసము

     
     వీణె వాయింపు మోవెలఁది నేఁడైనఁ దు
                      ష్టిగ విని పారణసేయుఁ గాని
     ఈభువనముల మియిరువురగానంబ
                      కాని యన్యము లింపు గావు నాకు

గీ. నని పలుక మాటమాటకు నద్భుతంబు
     చాలఁ బ్రబలంగ విని విని యాలతాంగి
     కరసరోజము ల్ముకుళించి కరము వినయ
     మతిశయిల్లంగ ని ట్లను నతనితోడ. 55

క. ఓయనఘ దేవుఁడవో యో
     గాయతకపిలాదిసిద్ధులందు నొకఁడవో
     నీయనుభావం బద్భుత
     మై యున్నది నామమెద్ది యానతి యీవే. 56

క. అని పలుక మణి స్తంభుం
     డనుసిద్ధుఁడ నేను జలరుహానన నీ వెం
     చినవారలలో నెవ్వాఁ
     డను గానని యతఁడు పల్కుటయు వినయమునన్. 57
 
ఉ. ఓమహితాత్మ మీవచన మొక్కొకటే పరికించి చూచినన్
     నామదిలోన నెంతయు ఘనం బగుచున్నది యద్భుతంబు మీ
     రేమహిమన్ యథార్థముగ నిట్లిది సర్వము గంటి రిట్టిమీ
     కీమహిఁ గానరానిది యేమియు లేదు గణించి చూడఁగన్