పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/85

ఈ పుట ఆమోదించబడ్డది

64

కళాపూర్ణోదయము

   
     మనవిద్య సాధింతు నని పూనీ నాఁ డీది
                  యెందు నెవ్వరును ము న్నెఱుఁగకునికి

గీ. గావున విశేషములు నీకుఁ గలవి వరుసఁ
     దెలిపి నీ నేర్చినట్లెల్ల దిద్దు మనుచు
     నొప్పగించితి నిమ్మహాయోగివర్యు
     ననుడు జాంబవతీసతి వినయ మొప్ప. 31

క. ఎప్పుడును మీవచస్స్థితిఁ
     దప్పక యే నడపుచున్న దాన నిపుడు నా
     తప్పొప్పులు మీ రరయుట
     యొప్పు న్విన నవధరింపుఁ డొకకొం తనుచున్ . 32

క. కుందనపుఁగమ్మిఁ దిగిచిన
     యందంబున జవరఁదనము నలరుందేనె
     ల్చిందినగతి మాధుర్యముఁ
     బొందుపడ న్వీణె ముట్టి పొలఁతుక పాడెన్. 33

సీ. ప్రౌఢితో సరిగమపధనిస్వరంబుల
                     ప్రతినియతశ్రుతిక్రమము లెఱిఁగి
     రాగ భేదముల వర్షములు దొలంగించి
                     లయతాలశుద్ధి నెంతయుఁ దలిర్ప
     గ్రామవిశేషమూర్ఛన లేరుపడ మంద్ర
                     మధ్యమతార సామగ్రి దనర