పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/80

ఈ పుట ఆమోదించబడ్డది

61

ద్వితీయాశ్వాసము

    సఫలితంబుగఁ జేయుచుఁ జాల వెలయు
    నంబుజాక్షునికొలువుకూటంబుఁ గాంచె. 10

క. కాంచి మణికంధరునితో
   గాంచనగర్బజుఁడు వలికెఁ గల కాలము వీ
   క్షించిన నిది నిచ్చలు నొక
   యంచితరుచి నెఱపుచున్నయది కనుఁగొంటే.11

శా. ఆవైకుంఠముఁ జూచినట్లు కడు నింపై యాసభామండప
   శ్రీవిస్ఫూర్తికతంబున న్మిగుల నా చిత్తంబు నానందము
   ద్రావైచిత్రిఁ గరంచుచున్న యది యేతద్ద్వారకాపట్టణం
   బీవిశ్వంబునఁ గల్లుమే లిదియపో యెందు న్వివేకించినన్.12

వ. అని పల్కుచుఁ జేరంబోవునంత.13
-
క. ఆఋషియాగమనం బపు
   డారసి చని చెప్పి రంబుజాక్షునకు బహి
   శ్చారిణు లగుపరిచారిక
   లారీతిని జెప్ప నతనియానతికల్మిన్ .14

సీ. బంగారు గొలుసులుఁ బవడంపుఁదఱిమెన
                    కోళ్ళును వింత బాగులబొగడలు
   రత్నంపుఁ జిలుకలు రాయంచపతిమలుఁ
                    బసిఁడిపువ్వుల వ్రాఁతపనులసొబగు