పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/49

ఈ పుట ఆమోదించబడ్డది

30

కళాపూర్ణోదయము

చ. తమతమ పెద్దవారు మునుదాఁచినద్రవ్యములున్నయట్లయుం
    డ మితము లేక యొప్పెడుధనంబులు దారు గడించి యుర్వి ని
    త్యము నమితంబుగా నవనిధానము లున్పుచు నప్పురంబులో
    నమరెడుకోమటుల్ నగుదు రల్లకుబేరునిధీశ్వరత్వమున్.

క. ద్విజులను శాస్త్రనియు క్తిని
    భజియింపుచు నిండ్ల సకలభాగ్యవిభవ మ
    క్కజ మై తనర సుఖింతురు
    సుజనులు తత్పురములోనిశూద్రులు నెమ్మిన్. 122

క. ఎప్పట్టున ఘనసారపుఁ
    గుప్పలగుగజాశ్వసుభటకోటుల చేతం
    గప్పురపుఁగ్రోవి యనఁ దగి
    యప్పురము కరంబు వెలయు నవనీస్థలిపై. 123


బంధు. అరుదుగఁ బిడికిట నడఁగెడునడుముల్
             హస్తిసమానపుయానములున్
       గురుజఘనములును గుచములభరముం
             గొప్పులగొప్పతనంబులు మే
       గరిగరికలు సిరి గలనగుమొగముల్
             కల్కి మెఱుంగుఁగనుంగవలున్
       దొరయఁగ వెలపడఁతులు విటధనముల్
             దోఁతురు చొప్పడ నప్పురిలోన్.