పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/461

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

442

కళాపూర్ణోదయము

యగలుసిరులు చిన్నె లుగాఁగ నతఁడు గడపెఁ
జలి నెలలు తద్వధూకు చశరణుఁ డగుచు.188

వ. తదనంతరంబ.189

మాలి. వికసితసితసూనోద్వేల బాలప్రవాళ
ప్రకటక పటరూఢ ప్రొడకీర్తిప్రతాప
ప్రకటజయసమంచత్పంచ బాణ స్తవోద్గా
యకశుకపిక కాంతం బై వసంతంబు వచ్చెన్.190

ఉ. బాలికతో వనీరతుల భాసిలు బేనికిఁ గుంకుమాంక రే
ఖాలలిత స్తన గ్రహణ కాంక్షను వా తెఱవాంఛఁ బెంచెఁ ద
ద్వేళఁ గడుం బచ్ళేమభిదేళిమదాడిమ కేళిమ త్తకీ
రాళియు బాలపల్లవర సాకలనాకులకోకిలంబులున్.191

గీ. ఇవ్విధంబున నతఁ డెల్ల ఋతువులందు
నంతకంతకు మతి ప్రేమ యగ్గలింపఁ
దత్తదుపభోగ్యవస్తు సంతతుల చేత
మిగుల నింపుగ రమియించె మగువఁగూడి.192

చ. అరుదుగఁ దెచ్చుకోలుపొలయల్క నొకప్పుడు మారొగంబు
గాఁ, జొరలిన నింతసాహసముపోలునే మోకని నవ్వు నవ్వ
ధూవరులఁ బ్రవాళశయ్య యిరువంకలఁ దత్తను తాపయో
గని, స్పరదక లంక ఫేనలవజాలమిషంబున డాలు సంధిలన్.