పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/443

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

424 కళాపూడోదయము

శా. మాకుం డద్భతశంఖ మొక్క టిని సంపాదించి దోగ్మధ్యక
స్తూరీ చర్చ నెపంబునం దనదు కేల్ దోఁపన్ సువర్ణ త్వతో
ధారిప్సన్ శశి కెత్తి చూప నతఁ డత్యంభోదుఁ డ్రై చేరి యి,
సారంబట్టుటదోఁచుఁ దగ్గళముఁ గేశౌఘంబుమోము గనన్

మ. శమగాంభీర్యధృతికమార్జవదయాశౌర్యప్రమోదాదికో
తమనా నాగుణరత్న కోశనిలయోద్యత్కాంచనద్వారబం
ధమహా సంభదనూన బాహుఁ డగునా ధాత్రీశువక్షఃకవా
టము పై నెట్టా గందపట్టగతినుండ న్నాదు కేల్ చేర్చుటల్

క. ఏలిక యె తను రాజొకఁ
డేలఁగ మనియునికి మెచ్చ కేమో యొక తా
రాళియుగ మఖల రాజశి
ఖాలంకృతి యయ్యె మదధిపొంఘినఖము లై.

గీ. ఆలలితచరణము లొతు కేలు కేలు
కోర్కి ( దద్వక్షమునఁ జేర్చుకుచము కుచము
దివుటఁ దద్రహఃకధ విను చెవులు చెవులు
పలుకు లేల తద్రతి గన్న బ్రదుకు బ్రదుకు.

చ. అని తలపోయుచున్ నిజవయస్యలు పిల్వఁగ వేళ యైన నం
దునికి యెఱుంగ కెందరయుచుండెదరో తను నంచు లేచిపో
వ నలరుఁబోఁడి యించుక ప్రవ ర్తిలు నంతన వేడ్కతో సఖీ
జను లరు దెంచి రచ్చటికి సంభ్రమ మొప్పఁగ నల్ల నవ్వుచున్