పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/322

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

303

తరల. అతఁడు సత్యము నాత్మయోగ సమాధికిన్ విజనస్థల
స్థితి మనంబునఁ గోరి పెక్కులు దేశముల్ చరియించుచు
గతివశంబుస జన్మదేశము గాంచి యందు గడుస్ వివి
క్తతల మంచు వసించెఁ గా శతతాళదఘ్న హ్రదంబులోన్.

సీ. అట్లు వసించి యోగా రూఢి నుండు చోఁ
దసయల్లుఁ డాలి పైఁ గినుక వలనే
మడువున నారీతిఁ బడి తన్నుఁ జేర వ
య స్స్తంభమణి మొద లైనయట్టి
వానిఁ గొన్ని టి నిచ్చి తా సంపెఁ గాని య
ప్పుడు దసబంధుత్వమును దెలుపఁడ
పోయిన బంధంబు పోనీక తగిలించు
కొన నేల మగుడఁగ ననుతలఁపున

గీ. సంత నెంతయు బహుకాల మరుగ నతఁడు
నియతివశమునఁ దద్యోగనిష్ఠ వదలి
హ్రదములోపల వెలువడి యరుగుదెంచె
సకలబుధ సేవ్య మైసశ్రీ శైలమునకు.184

ఉ. శీలిత యోగ వై భవుఁడు సిద్ధుఁడు వేడుకమించఁ గాంచె శ్రీ
శైలము నీలలోహిత లసన్మణిచిత్రితసాను వైభవో
త్తాలము సేవ కేష్ట ఫలదాసవిధానసవీన దేవ తా
సాలము నిత్యవర్ల గుణజాలము ము క్తిల తొలవాలమున్.