పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/32

ఈ పుట ఆమోదించబడ్డది

13

ప్రధమాశ్వాసము



    
       సీ. నానాగుణైకధానంబు నా నొప్పు
                     నరసింగమేదినీనాధవర్యు
           నిద్దంపుఁగీర్తులఁ దద్దయు విలసిల్లు
                     నట్టిపెద్దయహోబళాధిపతిని
           నాదిమనృపగతి మేదినీజనములఁ
                     బ్రోదిసేయుచు నొప్పుమాదవిభుని
           సన్నుతోన్నతవృత్తి, నెన్నికఁ గన్నట్టి
                      చిన్న యహోబళక్షితిత లేంద్రు

        గీ. సారతరచారుచారిత్రు నారనృపుని
           నాకుమారౌబళుండు తిమ్మాంబయందుఁ
           గనియె నేవురుసుతుల సత్కాంతియుతుల.
           విష్ణు సేవాభిరతులఁ బ్రవీణమతుల. 44

        క. అందు నరసింగవిభుఁ డిం
           పొందఁగఁ దాఁ బెండ్లియాడె నుభయకులశ్రీ
           సౌందర్యగుణచరిత్రము
           లం దిర మై తనకుఁ దగినలక్ష్మీదేవిన్ . 45

       స్ర. అలక్ష్మీ దేవియం దాయతమతి నరసింగావనీశుండు గాంచెం,
           ద్రైలోక్యస్తుత్యుల న్నందనుల నురుయశోధన్యునోబాహ్వ
           యక్ష్మా, పాలోత్తంసుం గవిత్వ ప్రమఖబహుకళాపారగుం
           దిమ్మరాజుం, బాలాదిత్యోపమానప్రచురతరరుచిస్ఫారు నారక్షితీంద్రున్ 46