పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/31

ఈ పుట ఆమోదించబడ్డది

12

కళాపూర్ణోదయము

          

           గనియె నారసింహజననాధు రఘుపతి
           క్ష్మాతలేంద్రు నోబమనుజవిభుని. 38

        క. ఆనారసింహవిభుఁ డస
           మానగుణుఁడు రఘుపతిక్షమావరుఁడు యశ
           శ్శ్రీనిధి యహోబళాఖ్యధ
           రానాధుఁడు సకలగుణవిరాజితుఁ డయ్యెన్ 39

        క. ఆమువ్వురలో నగ్రజుఁ
           డై మించునృసింహునకుఁ దదంగన యగుశ్రీ
           రామాంబకు నుదయించి మ
           హామతి హావళిచినౌభళాఖ్యుఁడు వెలయున్ . 40

       ఉ. దేవవిభుండు భోగమునఁ దీవ్రమయూఖుఁ డఖండచండతే
           జోవిభవంబునం దపనసూనుఁ డనూనవితీర్ణిపెంపునం
           దైవతమేదినీధరము ధైర్యమహత్వమునం దలంపఁ గా
           నావళిచిన్నయోబమనుజాధిపముఖ్యుఁడు రాజమాత్రుఁడే.

        క. ఇది సింగరయ్య సంతతి
           తదనుజుననుజుఁ డగునోబధరణిపువంశా
           భ్యుదయక్రమ మభివర్ణిం
           చెద నిఁక భువన ప్రసిద్ది చెన్నెసఁగంగన్. 42

       ఆ. ఆకుమారయోబభూకాంతుఁ డింపుతో
           బెండ్లియాడె గుణగభీరచరితఁ
           దిరుమలాంబ నెందుఁ బరమ పాతివ్రత్య
           పావనతఁ దనర్చుభాగ్యనిధిని. 43