పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/156

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృతీయాశ్వాసము. జేరునపు డది యీయమ్మ చెప్పినట్ల • శక్తి కిడియెడు ననుట నిస్సశయంబు, సీ. ప్రజల కందజకు నాపదలు వాపెడునట్టి చక్రిపట్టణములో జనన మంది వార కామిని నయ్యు గౌరవంబున సభ్య జను లిటు చేర రమ్మనఁగ బ్రదికి త్రైలోక్యగురుఁడు నారదమౌని ప్రియశిష్య న్విశేషముగ మన్నింప నలరి జగదీశురాణివాసపు సతుల్ శిక్ష గా వింపంగ సంగీతవిద్య నేర్చి గీ. తుద కొకానొకక పటసిస్టు, డొనర్చు శక్తిపూజకుఁ బశు వైతిఁ జర్చ సేయ నెంత వారికిఁ దప్పింప నెట్లు వచ్చు | బ్రహ్మ దొమున్ను వ్రాసిన వ్రాతఫలము. క. అని మది నడలుచుఁ బ్రియసఖు లను 'మొఱఁగుట దలఁచి కడుఁ గలంగుచుఁ దెగునే యనుభావ్య మెంత యంతయు ననుభవమునఁ గాక యనుచు ననయముఁ గుదెన్ . non వ. తదనంతరంబ డెందంబు డిందుపఱచుకొని ధైర్యబలంబునఁ గంఠగద్గదిక వారించుచు నావృద్ధ భామినితో నిట్లనియె. 18 000