పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/113

ఈ పుట ఆమోదించబడ్డది

94

కళాపూర్ణోదయము

    యేపట్టణము సముదీర్ణకామాక్షీత
               పఃపరిపాకసంపద్విధాయి
    యేపట్టణము సరిద్రూపవాగ్దేవతా
               సంశ్రయాంచితసమస్తద్విజాళి

గీ. బ్రహ్మయజ్ఞవపాహోమపరిమళసహ
    జాతసాక్షాత్పరబ్రహ్మసన్నిధాన
    భాగ్యసౌభాగ్య యోగ్య మేపట్టణంబు
    పుణ్యతర మైనయాకాంచిపురము గనియె. 138

గీ. కని మనంబున మోదంబు గడలుకొనఁగ
    నందు నేకామ్ర నాధుఁ గామాక్షిఁ దక్కుఁ
    గలుగు వేల్పుల దర్శించి కరిగిరీంద్ర
    మునకుఁ జని యుక్తగతి నెక్కిపోవ నెదుట.139

సీ. తనశంఖరుచికి నాతనిమనస్సత్వోద
                  యంబు ప్రత్యుత్థాన మాచరింపఁ
    దనచక్రమునకు నాతనిదివ్య తేజంబు.
                  గురుభావమున నెదుర్కోలుసేయఁ
    దనకృపాలక్ష్మి కాతనిభక్తి నెనరు పెం
                  పెసఁగఁ గౌఁగిటఁ జేర్చి యెత్తుకొనఁగఁ
    దనకౌస్తుభమున కాతనిశుద్ధచిత్ప్రకా
                  శము మైత్రి నెఱపుచు సరస మాడ