పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/110

ఈ పుట ఆమోదించబడ్డది

91

ద్వితీయాశ్వాసము

సీ. మణిమయప్రాకారమండపగోపురో
                  దీర్ఘకాంతులచేతఁ దేజమునకుఁ
    జారునదీహస్తచామరవీజన
                  వ్యాపారములచేత వాయువునకు
    నారాధనార్థయాతాయాతజనవిభూ
                  షారజోవృష్టిచే ధారుణికిని
    హృద్యచతుర్విధవాద్యస్వనోపయో
                  గప్రవర్తనముచే గగనమునకు 129

గీ. నిజనవాగరుధూపజనీరవాహ
    జనన సంబంధమహిమచే సలిలమునకుఁ
    బావనత్వంబు గలుగంగఁ బరఁగు వేంక
    టేశునగరు దాఁ జేరి యిం పెసకమెసఁగ.130

క. మునుపు పరివార దేవత
    లను దగ సేవించి నిర్మల ప్రేమభరం
    బున మేను గగురుపొడువఁగ
    ననఘు డతఁడు లోని కరిగి యగ్రమునందున్. 131

సీ. మృదుపదాంబుజములు మెఱుఁగుటందెలుఁ బైఁడి
                          దుప్పటియును మొలముప్పిడియును
     మణిమేఖలయు బొడ్డుమానికంబును వైజ
                          యంతియు నురమున నలరుసిరియు