పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/97

ఈ పుట ఆమోదించబడ్డది

ఏడవ ప్రకరణము

రాజశేఖరుఁడుగారి బీదతనము- సుబ్బమ్మమరణము- బంధుమిత్రుల ప్రవర్తనము- రాజమహేంద్రవర ప్రయాణము- గ్రహణస్నానము.

పూర్వము పుస్తకములయందు- శ్లో|| ఆధివ్యాధిశతైర్జనస్య వివిధైరారోగ్యముమ్మాల్యతే| లక్ష్మీర్యత్ర ప్రతంతిత్ర విసృత ద్వారా ఇప వ్యాపదః|| ఇత్యాదులకు ధనమే యాపదలకెల్లను మూలమని బోధించు వచనములను జదువునపుడు పురాణవైరగ్యము గలిగి రాజశేరుఁడుగారు దారిద్ర్యమునుగోరుచు వచ్చిరి. లక్ష్మివలెఁ గాక యామెయప్పయైన పెద్దమ్మవారిప్పుడు నాశ్రితసులభురాలు గనుక, అతని కోరిక ప్రకారము దరిద్రదేవత వేంటనే ప్రత్యక్షమయి యాతని యభిమతమును సిద్ధింపఁజేసినది. కాని తాను మునుపను కొన్నరీతిని పేదరిక మాతని కంత సుఖకర మయినదిగాఁ గనిపించలేదు.ఇప్పుడు మునపటివలె నిచ్చుటకు ధనము లేకపోయినదిగనుగ, ఈ వరకు నాతని నింద్రుడవు చంద్రుఁడ వని పొగడుచు వచ్చిన స్తుతిపాఠకు లందరును మెల్లమెల్లగా నాతనిని విడిచి పెట్టి , అతని వలె ధనికులయి బాగుపడినవారి యొద్దకు ఁ బోసాగిరి. అయినను రాజశేఖరుఁడు గారు చేయి చాచి యాచించినవారి నూరక పొమ్మన లేక నోటితో లేదనునది చేతితోనే లేదనుచు, తమ కున్నదానిలోనే వేళకు వచ్చి యడిగిన వారికి భోజనము పెట్టుచుండిరి. అందుచేత నతిధి యెంతబీదవాఁడయిన నంత సంతోషించుచుండునే కాని మున్నుపటి వలె విందులకు విజయంచేయు మిత్రులవంటివా రెవ్వరు నిప్పుడు సంతోషపడుచుండలేదు. ఈ దానధర్మములకు సహితము కొంత ధనము కావలసియున్నది. కాఁబట్టి ఇంటగల యిత్తడి సామనులను కుదువ </poem>