ఈ పుట ఆమోదించబడ్డది
- కామడీ ఆఫ్ ఎఱ్ఱర్సు
స. ఆం - రస్కర శ్రేష్ఠుడ దయచేయుమిటకు
- మస్కరి చేష్టల మఱి కట్టి పెట్టి,
- నీ బాధ్యతను నెల్ల, నేఁ డేమిచేసి,
- యోబాలిశుడు ! వచ్చితో చెప్పునాకు.
ఎ. ద్రో- నాదు బాధ్యతయెల్ల నడువీధినుండు
- యాదటమిముభోజనార్ధంబు బసకుఁ
- గొనిపోవుటయె: ఆవలనట నీకొఱకుఁ
- గనిపెట్టియుం దమ్మగారు, సోదరియు.
స. ఆం - స్ధాయిగ దెల్పుము దైవంబునెదుర,
- నీయొద్దనుంచిన వేయివరాల
- నేసురక్షిత మైనయిక్కను బెట్టి
- నాసరసకువచ్చి నాడొవొ నిజము;
- లేకున్న, మదినెమ్మి లేనప్పుడిట్లు,
- నాకడ మేలముల్నడసించు చున్న
- నీతలప్రక్కలు నేజేయుదిపుడు.
- చేతిధనం బేమిచేసితొచెపుమ.
ఎ. ద్రో- వెదకినను, వరాలువేయినాయొద్ద
- నొదవనేరవు; కాని యున్నవి వేయి
- దెబ్బలు, తలమీద దేవర వారు,
- కొట్టినవన్నియు గొన్ని తక్కువగ;
- గట్టిగా నవియెల్ల గ్రమ్మఱ నేనుఁ
- నేలిన వారు కర్పించుదునేనిఁ
- దాళంగలే రేమొ తరువాతమీరు.