పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/848

ఈ పుట ఆమోదించబడ్డది

నీతిదీపిక

దనకుగలదానిలోనెయీదగనుగాని,
దాతనని, యవ్వగొనియియ్యదగవుగాదు.

తే.కుంటివారలువృద్ధులు గ్రుడ్డివారు
లోనగాబాటుపడళ క్తి లేనివారి
కియ్యవలెగాని, యితరులకిచ్చి దాన
మహిని వెలయింపరాదుసోమరితనంబు.

తే.మనముగడియించుదానిలో, మఱచిపోక
నిలువచేయంగడగుగొంతనేర్పుమెరసి
వార్ధకంబున, రోగముల్ వచ్చునపుడు,
గడనజేసెడుపామర్ధ్హ్యముడుగుగాని.

                                    ముఖస్తుతి

తే.ఇంద్రు,డవునీవుచంద్రుడువీనటంచు,
దావునను జేరియొనదించు స్తవమువకును
కాయముప్పొంగివిశ్వంబుగానలేక,
చేతిసొమ్మల్లబోవిడిచెదవుమమ్ము?

ఆ.సరస జేరి, నిన్ను సం స్తవ మొవరించు
వారలెల్ల సఖులుగారునీకు;
గష్టకాలమందు గాచువాడొక్కడె,
నిక్కమైనపఖుడు నీకుదలప.

కే.ధనముగలిగినయన్నాళ్ళు, దానిలాగ
మెంటదిరుగుచునుందురు, విహితులట్ల;
ధనముపోయినమఱునాడు దలపవారు
తొంగిచూడరునీయిల్లుదూరమునను.