పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/838

ఈ పుట ఆమోదించబడ్డది

నీతిదీపిక

పెంచి, పెద్దవానిగఁజేసి మంచినట్టి
తల్లిఋణమించుకయుఁ దీర్పఁదరమె మనకు?

తే. విద్యయును బుద్ధి చెప్పించి, వెలయఁజేసి
       కాయమెక్కింతనొచ్చినఁ గలఁతపడుచుఁ
       దగుచికిత్సలఁ జేయించి, తెగులుమాన్పి
       మనల నింతవారిగఁ జేసె జనకుఁ డరసి.

తే. ఒక్కగర్భవాసంబున నుద్భవించి,
       యొక్కతల్లి పాలఁ బెరిగి, యొక్కశయ్యఁ
       బండుకొని యుండి, పయిఁ బ్రక్కఁ బడుచునుండు
       సోదరులు పరస్పరమైత్రి నుండవలయు.

తే. చేయవలెఁ దల్లిదండ్రులుచెప్పుపనిని
      మాఱువల్కక పుత్రుండు, మనినదనుకఁ
      జుట్టములనెల్ల బ్రేమతో ఁ జూడవలయుఁ
       జేతనై నంతసాయంబుఁజేయుచెపుడు.

మంచిబాలుఁడు.

ఆ. ప్రొద్దుపొడువకుండ నిద్దుర మేల్కని
       సమయకృత్యములను జక్కఁబెట్టి
       పుస్తకములఁ గొనుచుఁ బొరుగుపిల్లలఁగూడి,
        బడికిబోవు మంచిబాలకుండు.

తే. భోజనము చేయునప్పుడు బుద్ధిగలిగి
       లేనివస్తువు ల్తెమ్మని లేనిపోని
       యాగడముచేసి యలఁచక, వేగమునను
        గలకొలందినిభుజియించికదలిపోవు.

తే. తానుబడియందుజదివినదానినెపుడు
       మఱచిపోవక, వల్లించుమరలమరలఁ