పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/792

ఈ పుట ఆమోదించబడ్డది
అభాగ్యోపాఖ్యానము

క. భటులిరువురు గర్తమునం

దటు నిటువీక్షించుచుండి యదటునదమపై
నటు దయ్యమువలె శవమొ
క్కటిపడినన్మూర్ఛ పొంది ఘటికాద్వయికిన్.

 క. తెలివొంది కనులువిప్పుడు
నలశవముం గలదజొచ్చె నాళూరులకున్
గళవళ మినుమడికాగను
బెళపెళ యని చాపచుట్టు బిట్టుగ మ్రోయన్.

ఉ. అంతట నాభిటద్వితయ మాత్మదలంకుచు బైకిబోయినన్
గంతునవచ్చి ఘుర్ఘరము గ్రక్కున జంపునొ క్రిందనుండినన్
సంతస మాఱ దయ్యమిది చంపునొ యక్కట మేమి బుధి యం
చెంతయు జింతనొంది పనియేమియు దోచకయుండ నింతలోన్.

గీ. చాపలోనుండి "ఘనులార! చాపకుండ
బంధములువిప్పినన్నింత బ్రతుక జేయు"
డనెడువాక్యంబు విననై ననానవాలు
పట్టి తమరాజుస్వరమౌట వడీనెఱింగి.

గీ. కట్లు విప్పితీయ గాయంబునిండను
గాయములు చెలంగ గనులువిచ్చి
దై త్యనాధుడపుడు తనప్రాణభృత్యుల
యాననముల జూచె దీనవృత్తి.

క.అన్యోన్యముఖాలోకన
ధన్యత్వము జెంది భటులు దనుజేంద్రుండున్
నవ్యస్తభయభ్రాంతత
నన్యోన్యక్షేమవార్త లారసి రల్లన్.