పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/767

ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము

సామి నిలుచున్నవా రని చనవుకతన
మనవిచేసిన రమ్మను మనుచుఁ బలికె.

క. అరుదెమ్మని సెల విచ్చిన
నరిగి సరగను బణిహారు లావేల్పులతో
దొరవా రిట మిముఁ దోడ్కొని
యరుదేరఁగ మమ్ముఁబుచ్చి రనుచుందెలుప౯.

గీ. వార లందఱుఁ జనుదెంచి వరుసతోడ
వెన్నునకుఁ బెక్కు తెఱఁగుల వేఱువేఱు
మొక్కు లిడి పొగడ్తలు దెసల్ మోయఁజేసి
విన్నవించిరి తమపడ్డవెతల నిట్లు.

చ. పొగరున రక్కసీండ్రు తగమూవురుఁ బ్రోవుగఁ గూడి దాడిమై
జగములు గాసిచేసెదరు చావకమానెడుమేను పూనుటన్
మిగులఁగ వ్రంతల న్నొగిలి మీకడకి ట్లరుదేరఁగల్గె మా
యెగు లడఁగించిప్రోవఁగదవే యిదె వేఁడెద మెల్లవారమున్.

సీ. నెఱమగంటిమి మాని నీళ్ళుంమోవఁగ లోఁగి
                                    వెలియైనమలవిల్తు బలిమియెంత
మాఱువేసము పూని మఱి నీరిదూఱిన
పచ్చదుప్పటి వాని బలిమియెంత
ముదిమదివోయి ప్రాజదువులు గోల్పడి
తలకొట్లబడు తాత బలిమి యెంత
గొడావలుపడి కోడికూతకూసిన యట్టి
యలవేల్పు రాయని బ్లిమి యెంత
నిదుర యన్నది యెన్నడు వదలి తిరుగు
లాతి తెరగంటి దంటలచేతిబలిమి