పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/74

ఈ పుట ఆమోదించబడ్డది

64 రాజశేఖర చరిత్రము


చారములును చేయుచు భక్తితో ననుసరించుచుండెను. సుబ్బమ్మకు వ్యాధి వెంటనే నిమ్మళించినను స్వర్ణము చేయువిద్యను నేర్చుకోవలె ననునాసక్తితో రాజశేఖరుఁడుగా రాతనిని విడిచిపెట్టక, యింటనే యుంచుకొని నిత్యమును పాలును పంచదారయు వేళకు సమర్పించుచు నెగళ్ళకు వలయు పుల్లలను సమకూర్చుచు బహునిధముల భక్తి సేయుచు నాతని యనుగ్రహసంపాదనకుఁ దగిన ప్రయత్నములు చేయుచుండెను.ఈ ప్రకారముగాఁగొన్నిదినములు జరగఁగా నింతలో జనార్దనస్వామివారికిఁ గళ్యాణోత్సవము సమీపించినది. ఆ యుత్సవమును జూచుటకై చుట్టుప్రక్కలగ్రామముల నుండి వేలకొలది జనులు వచ్చి ప్రతిగృహమునను క్రిక్కిఱిసినట్టు దిగియుండెను.

          మాఘశుద్ధమున నేకాదశినాఁడు  రిధోత్సవమునకు వలయు ప్రయత్నములన్నియు జరుగుచుండెను. నాలుగుదినములు నుండి 

రధమునంతను నలంకరించి దాని పొడుగునను వన్నెవన్నెల గుడ్డలను చిత్రవర్ణము గల కాగితములను అంటించి, వెదురుకఱ్ఱల కొనలకు హనుమద్విగ్రహమును గరుడవిగ్రహమును గల ధ్వజపటములను గట్టి రధమునకుఁ దగిలించిరి. దేవుఁడుకూర్చుండు పైవైపున గొలలతో నున్న కదళికా స్తంభములను నిలిపి వానికి మామిడి మండలతోను వివిధపుష్పములతోను తోరణములను గట్టిరి. ఆ యరటికంబములకు నడుమను తెల్లని లక్కగుఱ్ఱములు రెండు రధము నీడ్చుచున్నట్లు ముంగాళ్ళు మీదికెత్తు కొని మోరలు సారించి వీధివంకఁ జూచు చుండెను. ఆ రధమునకుఁ బదియడుగుల దూరమున వెదురు వేళ్లతో నల్లబడి పయిన గుడ్డ మూయబఁడి వికృతాకారముతో నున్న యాంజనేయ విగ్రహములోను గరుడ విగ్రహములోను మనుష్యులు దూరి చూడవచ్చిన పల్లెలవాండ్రును పిల్లలును జడిసికొనులాగున