పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/484

ఈ పుట ఆమోదించబడ్డది
దున్నన్నీ నెఱనీటుసూటిగన నియ్యూరింక దోడ్త్తేగదే
కన్నారంగనుగొందు గోరిక లెసంగ న్నేలజేజేదొరా.

సీ. నరగనయోధ్యకు జనిఱేనిగనుగొని యందఱు నాలించునట్లుగాగ

నచ్చట నోరోడకాయనచ్చలో నుదిరిగద్దియ గూరుచున్న తఱిని
గ్రధకై శికుడు జన్నిగట్ల నొక్కటనంచి నలురోసియెందు గానంగలేక
తనకూతునకునొక్క తగినయేలికగట్ట దిరుగజాటించిన దేరులెక్కి
నేలగలయట్టిదొరలెల్ల నెలతగొనగ
నేగుదెంచుచున్నారు నేటికింక
గనగనానాడు నెడలేదుగాననరగ
జనగజెల్లునని దొరతోననగదయ్య.

గీ. నలుడుదక్కంగ నొండొక్కడలసినిలక

యొక్కనాటి కెయిక్కడ కుక్కుతోడ
దేరుదోలుక యరుదేర నేరడగుట
నందెనలుడున్న దొరతోడ నరుగుదెంచు.

క. అనియానతిచ్చి యనిచినఁ

జనియటం గ్రధకై శికుండు చయ్యనదిరుగం
దనకూతునొసగు నొకనికి ఁ
గనుగొననెల్లి చనుదేర గాదగుననియెన్.

ఉ. అంతనయోధ్యఱేడు నలుడచ్చటనుండగ జూచియెల్లినే

గంతునజేర జెల్లు గ్రధకై శికునూరటుగాన నొక్కనా
డెంతయు దేరుదోలుకొని యేగగల్గుదెనావతండు నే
డింతటిలోనజేరునని యీకొని కన్నుల నీరునించుచున్.

గీ. నేలతెఱగంటి దంటయాయేలికకడ

నిట్టులంటకు నరుదండి యెదగలంగి