పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/463

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితియాశ్వసము

చ. ఎలుగులు ఱేఁచులేనుగులు వేదులుగోతులుఁగారుదన్నులున్
సలుగులు నక్కలుంగలిగి సారెకు డాయఁగరానికానలొఁ
గలయఁగ నెల్లడం దిరిగి గాసిలియార్చుచును డస్సియేడ్చుచుం
దలఁకుచుఱేనిఁజీరుచును దాళఁగలలేక నెలుతయిట్టనున్.

నంచలార కడింది కొంచలార
కనుఁగొనరేయీరు కానలోనొడయని
జింకలార యలరుదొంకలార
చూడరేయీరలు సొగసుకానిని నెందుఁ
గొలఁకులార తుటారిచిలుకలార
తిలకించరేయీరు నలుని నెందునఁజెంచు
చేడెలారా చిఱుతయీడెలార
 తిన్నెలరా యేగేదఁగిగున్నలార
తేఁటులార మోజడదారిజోటులార
హత్తులార యోక్రొన్ననగుత్తులార
చెట్టులార యోచదలంటుగట్టులార.
 
గీ. అనుచుఁ జెట్టుచెట్టు కరుగునరిగియెండ
నడుగుదోయికాల నడలు నడలి
నీడనీడనిలుచు నిలిచినూతులుగాంచి
తొంగితొంగిచూచుఁ దొడరినాతి.

గీ. ఇట్టులెచ్చటనలుఁగాన కింతియెంటిఁ
గాననరుచునొకయేటి కడనుగాంచె
గాలినీరునాకులుఁదిండిగాఁగఁగొనుచు
నుండుకొందఱుజడదారులుండుచోటు.