పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/458

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము

చ. ఇటుతనచీరయెత్తుకొని యేగనలుండును లోఁదలంకియం
     తటనెదలోనఁదేఱిచెలిదాల్చినచీరచెఱంగుతానునుం
     దటుకుననట్టె చుట్టుకొనితద్దయుఁగుందుచునుండికొంతచెం
      గటనలుతెన్నులున్నఁగనికల్కిరొచూచితె యంచునిట్లనున్.

క. అరుగుగుదెదారిదెసకిది
     యరుగున్నీతండ్రి యూరికల్లదికలికీ
      యరుగునదియునుజ్జయనికి
     నరుగుంగొసలకు నద్దియన్నిటిలోనన్.

ఉ. ఎద్దియొతెన్నునాకుఁజననిత్తఱిఁజానలుకారుకానలం
      దద్దయూనంగదల్ గుడిచితాళ్ఁగఁజాలరుకాననింటిలో
      నొద్దికఁజుట్టలంగలసియుయుండుటలెస్సగఁదోచెనాకునేఁ
       డెద్దియునడ్డుగానక యేగఁదగుందలిదండ్రులొద్దకున్.

మ. అనినంగన్నులనీరుగాఱఁజెలియొయ్యన్ ఱేనికై చూచియ
       ల్లవఁదానిట్లనుఁగాననీకరణినేలాకుందఁగాఁగోరికల్
       దనరన్నాదగుతండ్రిసంతసిల నాతండేలునన్నేలకుం
       జనియందుండఁగఁజెల్లదేకలిసియిచ్చన్నీకునున్నాకునున్.

సీ. అనిననలుండునునౌకలయెక్కింత
యొరగించియించుకయూరకుండి
నీయాడినట్టులనీదినాదియుఁగాదె
నీతండ్రియేలెడు నేలయెల్ల
నేఁదొల్లిసిరులచే నెసఁగుచునట కేగి
యీలాగునేలాగు నేగనేర్తు
నేలయులచ్చియు నెఱిఁదూలియటఁజేర
నాతిరోననుఁజూచి వగరె యొరులు