పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/35

ఈ పుట ఆమోదించబడ్డది
రెండవ ప్రకరణము

అప్పుడే నీళ్ళకు వచ్చినవారితో ఇరువదియేండ్లప్రాయముగలయొకతెచేరువ నున్న మఱియొకతె మెడదగ్గఱకు చేయి పోనిచ్చి"కాంతమ్మ! ఈపట్టెడ క్రొత్తగా చేయించుకొన్నావా? నీ కేమి? నీవు అదృష్టవంతురాలవు. గనుక తల మొదలుకొని పాదములవఱకు నీమగఁడు నీకు నగలు దిగవేయుఁచున్నాఁడు."

కాంత-నిన్ననే కంసాలిసుబ్బయ్యచేసి తెచ్చినాడు. నాలుగు పేటల పలకసరులు కూడ చేయిచున్నాఁడు. పేరమ్మా! మీ మగనికి నీమీఁద బహుదయ అని విన్నాను. నిజమేకదా!

పేర-ఎందుకువచ్చినదయ? సంవత్సరమున కొక్కపర్యాయమయినను పట్టుమని పదివరహాలనగ చేయించిపెట్టుట లేదుగదా? పూర్వజన్మమునందు చేసికొన్న పాపముచేత నా కీజన్మమందుఇటువంటి-

ఇప్పుడు ప్రక్కనునిలచున్న మఱియొకతె-పేరమ్మా! నీవు వృధాగా లేనిపోనివ్యసనము తెచ్చిపెట్టుకొనుచున్నావు. నీ కేమయిన అన్నమునకు తక్కువయిబదా? బట్టకు తక్కువయినదా? మహారాజు వలె మగఁడు తిన్నగా చూచునప్పుడు నగలు లేకపోయిన నేమి! మగనికి ప్రేమ లేకపోయినతరువాత, దిక్కుమాలిన నగ లేందుకు విట్టి మోతచేటు. చూడు మన గ్రామములో బంగారమ్మకు శరీరము నిండనెన్నినగ లున్నవో! అనగలపేర్లె కొన్ని నేను వినలేదు. దీపములు పెట్టఁగానే వెళ్ళి డానిమగఁడు బోగముదానియింటిలోఁగూరుచుండును. దాని కేమిసుఖ మున్నది? నీ మగఁడెప్పుడును చీఁకటి పడ్దతరువాత వీధిగుమ్మము దాఁటఁడు.

పేర-నీవు చదువుకొన్నదానవు గనుకు, కావలసినన్ని శ్రీరంగనీతులు చెప్పగలవు. నీకువలె మా కెవ్వరికిని ఇటువంటి వేదాంతము