పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/342

ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వదేశయాత్రలు


మహాకాయుఁడు. ఆ నామధేయము చేతనే యతఁడు రాజ బంధువుఁడయినను మీరూహింపవచ్చును. అతఁడు నాయందు పుత్రవాత్సల్యము కలవాఁడయి నాయన్నపానాదులను గూర్చి ప్రతిదినమును తానే విచారించుదు, మూషిక మార్జాలాది జంతువులవలన నాకేవిధమయిన యపాయమును గలుగకుండ రక్షించు చుండుటకయి యెనిమిదేండ్ల! ప్రాయముగల తనపుత్రికకు నన్నొప్పగించెను. మూషికమార్జ్జ్జాలాదుల వలన మనుష్యునకు భయమేనని మీరనుకొనఁగూడదు. అక్కడి యెలుకలు మన దేశపు కుక్కలంతలేసి యుండును. ఇఁక పిల్లులన్ననో మన గోవులకంటె కొంచము పెద్దవి. కాఁబట్టి యిట్టి పెద్ద జంతువుల వలన నా వంటి యల్ప శరీరి కపాయము సంభవించుట యేమియాశ్చర్యము? నేనక్కడకు పోయిన మూఁడవ నాఁడే నాకొక్క గొప్ప గండము తప్పిపోయింనది. మీరాకథవిన్నచో నాసమయేచిత బుద్ధికిని నిరుపమాన ధైర్యసాహసములను మహాశ్చర్యనిమగ్న మానసుల కాకమానరు. నేనిప్పుడు పేర్కొన్న చిన్నదాని వేడుకకొఱకయి యింటివారు రెండు కంచిమేఁకలను పెంచినారు. అందొకటి వారము దినముల క్రిందట రెండు పిల్లలను పెట్టినది. వానినొకటితల్లిపాలు త్రాగి యాటలకయి చెంగుచెంగున గంతులువేయుచు నేను నిలుచున్న వైపునకు పరుగెత్తుకొని రామొదలు పెట్టెను. అటువంటి మహాజంతువు మృత్యుదేవతవలె నామీఁదికి పరుగెత్తు కొనివచ్చుచున్నప్పుడు బ్రాహ్మణుఁడూ నయ్యును నేనణు మాత్రమును జంకక వెనుకంజ వేయక, వ్యాఘ్రములు మొదలయిన క్రూరజంతువులు సహితము ప్రతి ఘిటించి నిలువఁబడినవారిమీఁదికి వచ్చుటకు భయపడునని వేఁటకాండ్ర వలన మనదేశము నందు విన్నమాటనుబట్టి వీరభటూనివలె ధైర్యముతో దానికెదురుగా నిలువఁబడితిని. అయినను మనదేశపుపులులకంటెను నధిక సాహసమును గలదయి యామేక పిల్ల్ల నాశూర గుణమును ప్రత్యక్షముగాఁ జూచియు వెఱచి వెనుకదీయక తలవంచుకొని నా