పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/302

ఈ పుట ఆమోదించబడ్డది

చేసిరి. వారాసంవత్సరమునందు పదుగురు మనుష్యులను నియమించి కలకత్తానగరముచుట్టునుమూఁఢామడల దూరములోఁగల గ్రామములయందు సహగమనముచేసిన పుణ్యసతుల సంఖ్యను లెక్కవేయింపఁగా, ఆఱుమాసములలోపల మున్నూఱుగురు పతివ్రతలు భర్తలచితులనెక్కి స్వర్గలోక నివాససుఖమును చూఱగొన్నట్టు దెలిసినది. ఆ సంవత్ససంవత్సరము మొదలుకొని సహగమనమునుమాన్పి దొరతనమువారు పాపము కట్టుకొనువఱకునుగల యిరువదియైదు సంవత్సరములలోను డెబ్బదివేల విధవలు మాదేశములో భర్తృసహగమనముచేసి పుణ్యలోకములకుఁబోయినట్టు దొరతనమువారి లెక్కవలననేతెలియవచ్చుచున్నది.ఆలెక్కలలో తగులని యిల్లాండ్రెందఱుందురో! దీనిని బట్టి మాదేశముదేశములలో నెల్లఁబవిత్రమయినదనియు మీకు భోధపడియుండవచ్చును. ఆసంగతిపోనిండు.మతాంతరులైన క్రైస్తవాచార్యుల యల్పకృషి యీశ్వరుఁడు మాయందుందుటవలననప్పుడేమియు కొనసాగినదికాదు.అటుతరువాత రామమోహనరాయలను పతితుఁడొకఁడుమాలోనేబయలుదేఱిక్రీస్తుశకము ౧౮౧౮ వ సంవత్సరము మొదలకొని సహగమనమును రూపుమాపుటకయి మహాకృషి చేయనారంభించెను.ఒక్క కలకత్తా నగరమునందు ౧౮౧౫ వ సంవత్సరములో౨౫౩ రును, ౧౮౧౾ వ సంవత్సరమునందు౨౮౯ గురును,౧౮౧౭ వ సంవత్సరమునందు,౪౪౨గురును,౧౮౧౮ వ సంవత్సరమునందు ౪౪ గురును,౧౮౧౯ వ సంవత్సరమున౪౨౧ గురును, ౧౮౨౦ వ సంవత్సరమున౩౭౦ గురును, ౧౮౨౧ వ సంవత్సరమున ౩౭౨ గురును, ౧౮౨౨ వ సంవత్సరమున౩౨౮ గురును, ౧౮౨౩ వ సంవత్సరమున ౩౪౦ రును, ౧౮౨౪ వ సంవత్సరమున ౩౭౩ గురును, ౧౮౨౫ వ సంవత్సరమున ౩౯౮ గురును, ౧౮ ౨౬ వ సంవత్సరమున ౩౨౪ గురును, ౧౮౨౭ వ