పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/294

ఈ పుట ఆమోదించబడ్డది

కంఢీభాషయందు విశేషపాండిత్యము కలవాడు కాకపోయినను స్వభాషయందు మహవిద్వాంసుడయి సంగీతమునందును చిత్రలేఖనందును సిల్పములయందును ప్రకృతిశాస్త్రములయందును నిరుపమాన సామర్ధ్యముగల నాగరిశాగ్రగణ్యుడు. అతడు మాకిరువురకును విద్య చెప్పుటయేకాక పురుషులు పొందదగిన స్వాతంత్ర్యములను గూర్చియు విద్యాభ్యాసమువలన గలుగు లాభములను గూర్చియు కూడ పలు మాఱు బోధించుచుండెను. పురుషవిద్యాస్వాతంత్ర్యములు నాకు క్రొత్తవిగా గానబడకబోయిననుబట్ట్టి స్త్రీలకు దాస్యముచేయ నలవాటుపడిన నాసహాధ్యాయునికి మాత్రమని వింతగా గనబడి యత్యుత్సాహమును గలిగించుచు వచ్చెను. మాయుపాధ్యాయుడుపదేశించిన బోధనలవలనను చేసిన యుపన్యాసములవలనను గాకపోయినను స్రీలయధికారమును రూపుమాపి యాదేశమునందు పురుషస్వాతంత్ర్యమును నెలకొల్ప వలెనన్న యభిలాషచేత సహజముగానే వారిరువురకన్నను నాకెక్కువయుత్సాహముండెను. నా సహాధాయుడించుమించుగా నిరువది స్ంవత్సరముల ప్రాయముగలవాడు; అపత్నీకుడు నవనాహరికురాలయిన యప్పగారి ప్రోద్బలమువలన చిన్నప్పటినుండియు కొంచెము విద్యనేర్చినవాడు. పూర్వము లక్ష్మణస్వామివారు శూర్పణఖ ముక్కుకోసినట్లుగా, గురువులవార పత్నీకుడయిన యాతని ముక్కు నీవఱకే మొదలంట గోసియుందురుగాని , జాతి భాషచదివి నవనాగరికురాలయి రాజకీయోద్యోగము నందున్న యాతని యప్పగా రాపని సాగసిచ్చినదిగాదు. బంధు జనులకు విరోధముగా నిప్పుడాతనిని రాజకీయ పాఠశాలకు పంపినదనియు ఆయప్పగారె. సహపాఠియైన నామిత్రుని పేరుభాక్ష్మీఫోడ్. నేను క్రమముగా ప్రతిదినము పాఠశాలకు పోయి పాఠము చదువుచున్నను, నా మిత్రుడు మాత్రము నోములు మొదలయిన వాని నిమిత్తము వరమునకు మూడు నాలుగు దినములు బడి మానుచు