పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/266

ఈ పుట ఆమోదించబడ్డది

నాసొమ్మటతఁడు గురుదక్షణగా గ్రహించినట్లయినను మిరూహింప వచును.వారికీయఱవగోడును దెలిసినదికాదు. నేనపుడు నాస్వభాషయైన కన్నడములోఁజెప్పిచూతమని ”నమ్మ–” అనియారంభించునప్పటికి వారిరువురును నావద్దకు వచ్చి చేయిపట్టుకొని ననులెమని లాగిరి. నేనెప్పుడు నాభాషాపాండిత్యము చూపుటకదిం సమయముకాదని మౌనము దరించి, మీవెంటవచ్చెదను నన్ను లొగవలదనియు మాయూరు విజయనగరమనియు నా పేరు సత్యరాయెచార్యులనియు నేను సద్రుబణుఁడననియు సమస్తము చేస్తె గచెసిచేప్పి, చివాలున లేచి వారివెంట నడువ నారంభించితిని ఊరను పేరును వంశమునుగూడనెట్లు సైగచేసితినని మిలొఁదెలియనివరికిఁ గొందఱికి సందేహము కలుగవచును గానియా సంశయుము నేను చేసైగచేయుచుండఁగ శ్రద్ధతోఁ జూచిన వారికి నివారణము కావలసిన దెశని చేప్పటవలన విడిపోదు. ఆ రాజాభటులలో నోక్కడు ముందు నడవఁగా మన దేశములోని గొప్ప రాజికియెద్యోగివలెనే వాని వెనుక నడుచు చుండెను. ఇట్లు కొంచెము దురము నడుచు నప్పటికి మేమొక పట్టణము యెుక్క రాజవీధి లోఁబ్రవేశించితిమి. అప్పుడు వీధిపొడుగునను మనుష్యులు నాకు కనబడఁజొచ్చిరి. వారి ధరించుకొన్న బట్టలు మొదలయినవి వివిధములుగానున్నను వారిలొ నొక్కరికిని గడ్డములును మీసములును లేవు. అట్టి విచిత్రమైన సృష్టివలన నాకప్పుడు గలిగిన యద్భుతానందములకు పరిమితి లేదు. ఆఘటనాఘటన సామర్ద్యము గల సర్వేశ్వరుఁడాదేశములో మగవారికి మూతికి మీసములు లెకుండ నేలచేసేవాయని త్రోవపొడుగుంనను నాలొ నేను వితర్కించుకొను చుంటిని. ఆసమయమునందు నాకాకస్మికముగా మఱియెుక సంగతి స్మరణకువచ్చినది. ఇది యాఁడుమాళయాళము గదా యిందు బురుషులెట్లుందురని నా