పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/263

ఈ పుట ఆమోదించబడ్డది

ఆడుమళయాళము

నిర్హేతుక జాయమాన కటాక్షము కలుగుచుండును. కాఁబట్టి వెనుకటి వలెనే యీశ్వరానుగ్రహమువలన నాకిప్పుడు దర్శనమిఛ్ఛిన యీకడపటి వాక్యములను మీరందరును పరమ ప్రమాణముగా నంగీకరించి గౌరవించవలెను. ఇవి భక్తి విశ్వాసములు గలవారికందరికిని తప్పక వేదములు వలెనే ప్రత్యక్ష్య దృష్టములకన్నను అధిక ప్రామాణికములగును. మరఱియు నేను మొట్టమొదట భూమిమీఁది గుహలో దిగుటయాదిగా పఱుపు మీఁదనొఱగి జాఱుటతుదిగా మేలుకొని యున్నంతవరకు నడిచిన దారి ప్రమాణమంతయు నేను కట్టకడపట గులోని పఱుపును మరల నానుకొనుటమొదలు పయికి భూమిమీఁదకి వఛ్ఛువరకును జరిగిన దారిప్రమాణముతొ సరిగా సరిపోయినందున నాస్వప్న మణుమాత్రమును ప్రత్యక్ష విరుద్దమయినదియుఁ గాదు. అంతేకాక నాకాకల తెల్లవారుజామునఁ గలిగినదగుటచేత అధిక విశ్వాసార్హమయినది. నేనిప్పుడు చెప్పినదంతయు ఆడమళయాళమునకు సరియైనమార్గము. ఈగురుతులు పట్టుకుని యాదేశమున కెవ్యరేనిమిషమునఁ భొఁదలఁచినను. అక్కడి దేశ భాష నేర్చుకొని మరిపోఁదఁలచిన పక్షమున ముందుగా నావదకు వచ్చియారునెలలు శుశ్రూషచేయుఁడు. మిమ్మాభాషలో పండితులనుజేసి పంపెదను. గురుదక్షిణ తరువాత మీయిష్టమువచ్చినంత సమర్పించుకోవఛ్చును. గురుదక్షిణలేక యభ్యసించినవిద్య సఫలముకాదని పెద్దలలో మెలగనేర్చిన మీకే విశదమయియిండును. మీరుకాని చీటీమీఁద నాకుత్తరము వ్రాసినపక్షమున నాయిప్పటివాసస్థానాదులను మీకు వివరముగాఁ దెలిపెదను. ప్రయాణముకథ నింతటితోఁ జాలించి యిఁక దేశవృత్తంతమున కారంభించెదను సావధానముగావినుఁడు.