పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/178

ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రము</big

తక్షణమే పదుగురు భటులను రప్పించి, మీరందఱు నీయన చెప్పినట్లు చేసి పర్యవసానము మాతో మనవి చేయ వలసినదని గట్టి యుత్తరువు చేసిరి. సుబ్రహ్మణ్యము వారినిదీసికొని తిన్నగా నీలాద్రిరాజున్న యింటికిఁ బోయి వీధితుపు వేసియుండగా వారందరిణిని, ఇంటిమట్టును కావలి పెట్టియిద్దఱిని వెంటదీసికొని పాణిద్వారమున దొడ్డిలో ప్రవేశించెను. అప్పుడు నీలాద్రిరాజు పెరటిలో నిలుచుండి క్రొత్తమనుషులు వచ్చుట చూచి తత్తరపడ సాగెను.

నీలా-సుబ్రహ్మణ్యముగారా? ప్రొద్దుననే మీరిక్కడకు వచ్చినారేమి?

సుబ్ర-తమ దర్శనము నిమిత్తమే. దొడ్డిలోనేమిచేయుచున్నారు?

నీలా-విత్తనములు చల్లిం చుటకయి దొడ్డి త్రవ్వించినాను. ఏమిగింజలు చల్లింతునాయని యాలోచించుచున్నాను.

అని యాతొందరలో తన విషయమున భహువచన ప్రయోగమును మఱచిపోయి తన నిజమయిన స్థితి కనుగుణముగా మాటాడెను. సుబ్రహ్మణ్యము మాఱుమాటాడక భటులతో లోపలజొరబడి పెట్టెలన్నియుఁ దీయించి పరీక్షింపఁగా వానిలో మున్ను తమలోపల బైరాగి యెత్తుకుపోయిన వస్తువులను మఱికొన్నివస్తువులను గానడెను.గాని రాజుగారి సొత్తేమియుఁగనబడలేదు.తనసొమ్ము దొరకడంబట్టి నీలాద్రిరాజే దొంగయని నిశ్చయముచేసి వస్తువులు భూమిలో పాతిపెట్టి త్రవ్విన యానవాలు తెలియకుండ, మఱుగు ఱుచుటకయి దొడ్డియంత యుఁద్రవ్వించి విత్తనములు చల్లుటకని మిషపెట్టి బొంకుచున్నాడని యూహచేసి యతడు భటులచేత దొడ్డినంతను త్రవ్వించెను: అందొకచోట రాజుగారి లోపలఁబోయిన సొత్తం