పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/8

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6


13. సాధనసంపత్తి లేక “అహంబ్రహ్మ" అను వానికంటె సాధనసంపత్తి గల్గి దాసోహమ్మనువాడు గొప్పవాడు.

14. దేహాభిమానముగలవాడై ఎవడు “అహంబ్రహ్మ" అను మహావాక్యమును వాగ్రూపముగ ఎన్నిసారులు బల్కునో అన్నిపర్యాయములు, వాడు గుంటనక్కయై పుట్టునని మహర్షులు పల్కుచున్నారు.

ఎవడుఆధికారియైఒక్కసారి "అహంబహ్మ” యని పల్కునో వానితో సమాను లీముల్లోకము లందును నుండజాలరు.


15. తక్కువ జాతి వారిని ఉన్నత స్థితిలోనికి తీసికొనివచ్చు శక్తి యున్నచో నా కార్యమునకు ప్రయత్నింపుము. వారిని పైకి దెచ్చుటకైపోయి నీవు వారిలో కలసిపోయినట్లైన ఆకార్యమునకు వెళ్ళకుండుటయే మేలు.


16. నిర్జీవము లన్నియు ప్రవాహజలములో కొట్టుకొని పోవునుగాని ఎదురీదజాలవు. ప్రాణముగల జీవులైనచో ఎదురీదగలవు. ఆలాగుననే జ్ఞానహీనుడు సంసార ప్రవాహములో కొట్టుకొనిపోవును. జ్ఞాన చైతన్యము గలవాడు ప్రకృతి కెదురీది పరమాత్మను జేరగలడు.


17. కస్తూరిమృగము తననాభియందున్న సుగంధము పరిమళించుచుండగా ఆసుగంధము తనయందేయున్నదని యెఱుంగక, అడవియంతయు తిరిగి తిరిగి, వెదకి వెదకి, అలసి, యొక్క చోట పరుండి తనముక్కును నాభికి సమీపమం దుంచగా చాలినంత పరిమళము దొరుకుటచే నెట్లు తృప్తి నొందెనో, అట్లే మానవుడున్ను సుఖము తనయందున్నదని తెలియక ప్రపంచవిషయము