పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/44

ఈ పుటను అచ్చుదిద్దలేదు

42

చున్నది. లేకున్న ఇంతనీచమైన ఉపమానము జెప్పి, నన్నవ మానము జేసితివని కన్ను లెర్రజేసెను. ఆమాటకు మంత్రి ఇట్ల నెను. ఓ రాజా ఈ విషయము పరీక్ష జేసి చూడుమని చెప్పి రాజుగారి పెంపుడుకుక్కను సభకు చెప్పించి యా కుక్కను తోకయు చెవులును తెగగొట్టించి కర్రతో కొట్టి బయటికి తఱిమి వేసిరి. మరల యాకుక్కను పిలువగానే యాకుక్క ప్రభువుయొ ద్దకు వచ్చెను. మఱల యా కుక్కను పట్టుకొని ఒక కాలు తెగ గొట్టించి, దెబ్బలుకొట్టి బయటకు వెళ్లగొట్టిరి. వెంటనే యా కుక్కను భాషతో పిలువగానే కుంటుకొనుచు నెత్తురు గార్చు కొనుచు తన ప్రభువువద్దకు వచ్చి మహాభక్తితో నిలచెను. ప్రభువు యా కుక్క యొక్క విశ్వాసమునుజూచి మహా శ్చర్యము నంది మంత్రియొక్క హృదయమునకు మెచ్చుకొని బహుమానము లొసగెను.

110. పంచభూతములైదును ఒక్క తత్వములో నుండి వచ్చినను, ఒకదానికొకటి విరుద్ధములై యున్నవి. ఎట్లనగా, భూమి జలముచేత కరిగిపోవుచున్నది. అగ్ని జలముచేత నార్ప బడుచున్నది. మఱియు, ఆయాభూతమునం దాయా భూతము కలిసినప్పుడు అభివృద్ధి యగుచున్నవి. ఎట్లనగా, గాలికి మఱి కొంతగాలి సహాయమైనచో పెద్ద ఝంఝూమారుత మగు చున్నది. అగ్నిలో మఱికొంత అగ్ని కలసినచో విశేషయగ్ని యగుచున్నది. జలమునకు మఱికొంత జలము గలసినచో పెద్ద ప్రవాహమగుచున్నది. అట్లే త్రిగుణములుకూడ సత్వమునకు రజమును, రజమునకు తమమును, రజస్తమములకు సత్వమునూ విరోధమగుచున్నవి. అట్లుగాక, సత్వమునకు మఱియొక సత్వము