పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/16

ఈ పుటను అచ్చుదిద్దలేదు

15

39. మానవులలో మూడు రకములవా రున్నారు. ఎట్ల నగా, ఎవ్వరును నాకంటే మించియుండకూడదనియు, అట్లధి కులుగా యున్నచో వారియెడ అసూయగలవారు అధములని చెప్పబడుదురు. అందరున్నూ సమానముగా నుండవలయునని కోరువారు మధ్యములని చెప్పబడుదురు. అందరునూ నాకన్న మిన్నయై యుండవ లెనని కోరువారు ఉత్తములని చెప్పబడుదురు. ఈ దినము కూలి జేసి రేపు కూలి యడుగు వాడు ఉత్తముడని చెప్పబడును. రేపు జేయబోవుపనికై ఈదినమే కూలి దెచ్చు కొనువాడు అధముడని జెప్పబడును.

40.ఒక ఇంగ్లీ షుపండితుడు(డార్విన్) మనజన్మమున కారంభము చేప జన్మమనియు, ఆమీద పక్షి యనియు, తదుపరి కోతియనియు, ఆఖరున మానవజన్మముగా మారెననియు, ఇట్లు కొన్ని మార్పులు మాత్రము చెప్పెను గాని, మానవజన్మమునుంచి ఏ రూపంగా మారునదియు చెప్పక అక్కడికే ఆపి వేసినాడు. మన హిందూ వేదములును, ఋషులున్నూ, మానవ జన్మమునకుముందు ఎనుబదినాలుగులక్షల విధములుగా మారె ననియు, తుదకు మానవుడైనాడనియు, ఇచ్చటనుండి తన గమ్య స్థానమైన పరమాత్మనుపొందు మార్గమధ్యములో యక్షకిన్నర సిద్ధవిద్యాధర దేవబ్రహ్మాది జన్మములైన మార్పులు జెందవలయు ననియు, ఆవిద ము క్తి పదమును జెందుననియు చెప్పియున్నారు. మనమతము ఎంత విశాలమైనదో యోచించుడు. ....

41. యదార్థమైన గురువువద్ద శిష్యత్వము చేయుట కత్తిమీద నడచుటకంటెను కష్టమని కబీరుదాసుగారు చెప్పి