పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/376

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. వనిత యేమని మాటలాడెదు వచోవైదగ్థ్య మేపారఁగా
ఘనతారుణ్యకళావిలాసమదరేఖామాద్యదుచ్యద్వధూ
జనచేతోహరుఁ డాతఁ డెక్కడ మహాసర్వజ్ఞుఁ డోచెల్ల చూ
చిన నే నెక్కడ బాల్యచాపలభర క్షిప్తాంత[1] రాత్మంగదే. 141

ఉ. పల్లవికాజనంబు లనువారము లెప్పుడు ప్రాంతభూమి వ్రే
పల్లియలోన నమ్మురవిభంజను చేష్టలు చూచుచుందు ర
ప్పల్లవపాణు లుల్లముల భావనచేసిన నొప్పుఁగాక సం
ఫుల్లముఖాబ్జ మా కెఱుఁగఁ బోలునె తన్నిజభావవర్తనన్. 143

గీ. అనిన సెలవివాఱ నలఁతి[2] నవ్వొలయించి
కొనుచుఁ జేరఁబోయి[3] కువలయాక్షి
కేలుగేల లీలఁ గీలించి యిట్లంటి
వారిజాక్ష చతుర వాక్యభంగి. 145

చ. ఎఱుఁగని మాటి నంగవయి యెవ్వరి ముందర నాడె దిట్లు నీ
తెఱఁగిది నీకు సుబ్బె[4] సుదతీ మును శారికచేత నెయ్యపుం
గఱదలు చెప్పి పంపి మురఘస్మరుచిత్తము గుత్తజట్టిగా
నెఱఁదగఁ[5] గొన్నయట్టి తరుణీమణి యెవ్వతె నాకుఁ జెప్పుమా. 146

తే. ఇంచు కంతయుఁ దలఁపవై తిందువదన
వెన్నుఁ డెవ్వరికై పొక్కుచున్నవాఁడొ
యతని దురవస్థఁ దలపోయ నక్కటకట
వెలఁది యడవికిఁ గాసిన వెన్నెలయ్యె. 147

తే. వెఱ్ఱితనములు యాదవవిభుని కడలు
తెలియదో కాక శైశవోదీర్ణమైన
నీ గుణంబును నిన్నును నీరజాక్షి
యుల్లమునఁ జాల నాశించి యున్నవాఁడు. 149



  1. ప్రా.స.వ.-భరక్తిస్తాంత-సా.ప.
  2. ప్రా.స.వ.-బాఱ్లవలఁతి-సా.ప.
  3. ప్రా.స.వ.-వారువోయి-సా.ప.
  4. ప్రా.స.వ.-లబ్బె-సా.ప.
  5. ప్రా.స.వ.-నెఱదగ-సా.ప.