పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/365

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ. సఖులు గొలువఁ[1] గేలిసౌధమధ్యంబున
పణఁతి మృదులశయ్యఁ బవ్వళించి
యిష్టకథల దగిలి హేలావినోదమున్
జరుపుచున్నయట్టి సమయమునను. 25

క. మే[లి చెలియ యో][2]ర్తు ప్రసం
గోచితమై పెద్దచేసి యుగ్మలిమ్రోలన్
నీ చరితంబులు చెప్పెను
వాచాప్రాచుర్యచర్య వైఖరి మెఱయన్. 26

ఆ. అదియ నందుగాఁగ యదురాజనందన
విషమశరుఁడు పువ్వువిల్లుఁ గేలఁ
బట్టి యా లతాంగిఁ బరవశఁ గావించె
నహహ కుసుమసమయ మలినిఁ బోలె. 30

సీ. దర్శించు చూడ్కులఁ దనివి వో కేప్రొద్దుఁ
జెలులు వ్రాసిన భవచ్ఛిత్రకములు
పాడు వీణియఁ గేలఁ బలికించి భ[వదీయ
కృతులు][3] చెక్కులఁ బులకించుకొనుచు
విలిఖించు కొనగోర విషమసాయకలేఖ
నీ పేర నవపద్మినీదళములు
పట్టునెత్తమ్మి చే నిట్టూర్పుల నలంచు
నతనుబాణం బన్న యలుకఁ[4] బోలె

ఆ. [(కువల)యా][5]క్షి రేలు కోర్కితోఁ బెడఁబాయు
నిదుర కొఱకుఁ బగలు నీరజాక్షి
చెలువ చెక్కులందుఁ జేర్చుఁ బాండిమరేఖ

ముఖవినిర్జితేందుమూర్తిఁ బోలి. 32

  1. సఖుల గొలుపు (సా.ప.)
  2. ప్రా.పూర
  3. ప్రా.పూర
  4. యెలుక (సా.ప)
  5. ప్రా.పూరణము స.వ. రాక్షి (సా.ప.)