పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/363

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. విను జనార్దన (మున్ను వి)[1]న్నాఁడ వీవును
వసుధ నొప్పారు నవంతిదేశ
మబ్భూమి కధినాథుఁడై యుండు ననువిందు
నగ్రజన్ముఁడు విందుం డధికబలుఁడు
సమరసమ్ముఖజయశాలి యివ్విందాను
విందుల వెసు[2]బుట్టె విమలభాను
కౌస్తుభంబులతోడఁ గమల పుట్టినయట్లు
వెలఁది యొక్కతె పూర్ణవిధునిబాస్య

ఆ. యా లతాంగి వొలిచె నంతఃపురంబులోఁ
గురులు నొసలిమీఁద గునిసి[యాడఁ][3]
బైనటించు[4] తేఁటి పదువతో నందనా
వనిఁ దనర్చు కల్పవల్లి వోలె. 12

ఉ. అంతట నొక్కనాఁడు [దను][5]జాంతక విందుఁడు కూర్మిసోదరిం
గంతు కృపాణవల్లరికి గాదిలిచుట్టము వోని కన్య న
త్యంతవయోభరాలస నిజాంఘ్రిసరోరుహదర్శనాగతం
గాంతవితాంతకాం[తిఁ బొడ][6]గాంచి మనంబునఁ బొంగె నెంతయున్[7]. 15

ఆ. ఆ లతాంగిఁ దన్వి హేలాసమంచిత
ననుపమాన యౌవనాభిరామ
నే నృపాలసుతున కిత్తునొక్కో యని
యుల్లమునఁ దలచి యొక్కనాఁడు. 16

క. సురుచిరమణిఫలకంబున
ధరణింగల రాజసుతులఁ దరుణవయో సం
భరితులఁ గులసంజాతుల

నిరుపమమతి వ్రాసిచూపె నిజసోదరికిన్. 17

  1. ప్రా. పూరణము
  2. విందులకును (సా.ప.)
  3. ప్రా. పూరణము
  4. వైనటించు (సా.ప.)
  5. ప్రా. పూరణము
  6. ప్రా. పూరణము
  7. గాంచె మనంబునఁ బొంగె నింతయున్ (సా.ప.)